ఆధార్ ఉంటేనే ‘నగదు బదిలీ’

21 Dec, 2014 02:22 IST|Sakshi
ఆధార్ ఉంటేనే ‘నగదు బదిలీ’

* జనవరి నుంచి పథకం అమలు
* డీలర్లకు బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్ అందించాలి
* గ్యాస్ వినియోగదారులకు కలెక్టర్ సూచన
ప్రగతినగర్ : గ్యాస్ వినియోగదారులు ఎల్‌పీజీ డీలర్లకు వెంటనే బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లు అందించాలని కలెక్టర్ రొనాల్‌రోస్ సూచించారు. లేని పక్షంలో నగదు బదిలీ పథకం ద్వారా ప్రభుత్వం అందించనున్న సబ్సిడీ కోల్పోతారని స్పష్టం చేశారు. జనవరి ఒకటి నుంచి నగదు బదిలీ పథకం అమలవుతుంద ని కలెక్టర్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకర్లు, పౌర సరఫరాల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ గ్యాస్ ఏజెన్సీలు, విని యోగదారుల బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్ నం బర్ల సేకరణపై సమీక్ష జరిపారు. నగదు బదిలీ పథ కం అమలు నేపథ్యంలో వినియోగదారుల బ్యాంకు ఖాతా నంబర్, ఆధార్ నంబర్ల సీడింగ్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాల్సి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఇందుకోసం మహిళా స్వయం సహాయక సం ఘాల సహకారాన్ని తీసుకోవాలని గ్యాస్ డీలర్లకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ గ్యాస్ ఏజెన్సీలు 13 ఉండగా 1,86,970 కనెక్షన్లు ఉన్నాయి. బ్యాంకు సీడింగ్ 56 శాతం, ఆధార్ సీడింగ్ 86 శాతం జరిగింది. హిందుస్థాన్ పెట్రోలింగ్ కార్పొరేషన్ గ్యాస్ ఏజెన్సీలు 11 ఉండగా 1,29,375 కనెక్షన్లు ఉన్నాయి. 48 శాతం బ్యాంకు సీడింగ్ జరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ ఏజెన్సీలు 20 ఉండగా 1,20,389 కనెక్షన్లు ఉన్నాయి. 48 శాతం బ్యాంకు సీడింగ్ జరిగింది. మిగిలిన వినియోగదారుల బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్ నంబర్లు సేకరించి బ్యాంకులకు జాబితాలు అందచేయాలని గ్యాస్ డీలర్లతో కలెక్టర్ పేర్కొన్నారు.

బ్యాంకర్లు సైతం అనుసంధాన ప్రక్రియను వేంటనే పూర్తిచేయాలన్నారు. ఆధార్ లేని వినియోగదారులు వెం టనే ఆధార్ తీసుకుని బ్యాంకు ఖాతా నంబర్లతో పాటు ఏజెన్సీలకు అందచేయాలన్నారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రామకృష్ణారావు, డిప్యూటీ ఎల్‌డీఎం రవీంధ్రనాథ్, డీఎస్‌ఓ కొండల్‌రావు, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ సెల్స్ మేనేజర్లు బ్రహ్మానందరావు, శివరాజ్‌సింగ్, మోహన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు