‘ప్రణయ్‌’ కేసును సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

8 Oct, 2018 21:10 IST|Sakshi
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న మల్లయ్య 

మిర్యాలగూడ టౌన్‌ : ప్రణయ్‌ హత్య కేసును హై కోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని మాలమహానాడు జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెల్తుల మల్లయ్య, యామల సుదర్శనం డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ముత్తిరెడ్డికుంటలో గల ప్రణయ్‌ నివాసం వద్ద మాలమహానాడు ఆధ్వర్యంలో ‘కులాంతర ప్రేమ వివా హాలు–కులదురహంకార హత్యలు–నివారణ పరి ష్కార మార్గాలు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా నేటికీ అంటరానితనం పోలేదని, ఎక్కడో ఒక చోట ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉన్నాయన్నారు. వాటిని నియంత్రించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కులాంతర, మతాంతర వివాహాలను చేసుకున్న వారికి రక్షణగా ప్రత్యేక చట్టాలను తీసుకురా వాలని డిమాండ్‌ చేశారు. షెడ్యూల్‌ కాస్ట్‌కు చెందిన పెరుమళ్ల ప్రణయ్‌ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు చాలా దుర్మార్గంగా హత్య చేయించారని అన్నారు. (అమృతను చట్టసభలకు పంపాలి)

ప్రణయ్‌ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిం చేం దుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలన్నా రు. ప్రణయ్‌ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, మారుతీరావు ప్రణయ్‌ హత్యకు ముందు ఎవరెవరితో మాట్లాడాడో మారుతీరావు ఫోన్‌ కాల్‌ డేటా ప్రకారం దర్యాప్తు చేపట్టాలని చె ప్పారు. అందుకు సంబంధించిన వారిపై కూడా కేసులను నమోదు చేయాలని, హత్యతో సంబంధం ఉన్నవారిపై  చర్యలు తీసుకోవాలన్నారు. మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముండ్లగిరి కాంతయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పరంజ్యోతిరావు, శివరాజు, అశోక్, కాంతయ్య, పేరుమళ్ల నర్సింహారా వు, జిల్లా అధ్యక్షులు కామర్ల జానయ్య, నగేష్, సోమరాజు, వెంకటరత్నం, స్వామి, కోటయ్య, దేవయ్య, ఏడుకొండలు, రవి, జోజి, విజయ్‌కుమార్, మట్టయ్య, రాజు, మల్లయ్య, బాలస్వామి, నాగయ్య, బెంజమన్, రాజరత్నం  ఉన్నారు. (అమృతకు వ్యవసాయభూమి, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు)            

చదవండి:

ప్రణయ్ విగ్రహం: కేటీఆర్ అనుమతి ఇవ్వాలి!

‘ప్రణయ్‌’ నిందితులను ఉరితీయాలి

మారుతీరావుకు మద్దతుగా శాంతి ర్యాలీ


 

మరిన్ని వార్తలు