కులవివక్ష బాధాకరం

14 Sep, 2015 00:15 IST|Sakshi

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాములు
కేవీపీఎస్ జిల్లా శిక్షణ తరగతులు ప్రారంభం
 
 జడ్చర్ల టౌన్ : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు దాటినా, నేటికీ దేశంలో కులం, వర్గం అనే అంశాలు గ్రామీణ స్థాయి లో కొనసాగుతూనే ఉన్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాములు అన్నారు. కులవివక్ష పోరాట సమితి ముఖ్య కార్యకర్తల శిక్షణ తరగతులు ఆదివారం కావేరమ్మపేట పంచాయతీ ఫంక్షన్ హాలులో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ దళితులకు ప్రయోజనం కలిగించే చట్టాలు సరిగా అమలు కావడం లేదన్నారు. ఫలితంగా సమాజంలో ఇంకా కులవివక్ష కొనసాగుతోందన్నారు. అణగారినవర్గాలపై నేటికీ పెత్తందారులు, అగ్రవర్ణాల పెత్తనం కొనసాగుతూనే ఉందన్నారు.

దీనిని దళితులందరూ కులవివక్షను సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. కులవివక్షను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషిచే యాలన్నారు. శిక్షణ తరగతులు సోమవారం కూడా కొనసాగనున్నాయి. శిక్షణ తరగతులను సమితి జిల్లా కార్యదర్శి కుర్మయ్య జెండా ఆవిష్కరించి ప్రారంభించాగా, రైతు సంఘం  కార్యదర్శి వెంకట్రాంరెడ్డి సభలను ప్రారంభించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి పర్వ తాలు, ఉపాధ్యక్షుడు దీప్లానాయక్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, మత్య్సకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సత్తయ్య, కేవీపీ ఎస్ డివిజన్ అధ్యక్షుడు జగన్, పట్టణ అధ్యక్షుడు లదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు