మహేశ్వర్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్‌ చేశారు?: క్యాట్‌

18 Dec, 2019 01:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎస్‌ ట్రైనీ కేవీ మహేశ్వర్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్‌ చేశారో బుధవారం తెలియజేయాలని కేంద్ర హోం శాఖను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశించింది. తనను అన్యాయంగా సస్పెండ్‌ చేశారని పేర్కొంటూ మహేశ్వర్‌రెడ్డి క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ కేసును మంగళవారం క్యాట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ మెంబర్‌ బీవీ సుధాకర్‌ విచారించి హోం శాఖకు నోటీసులు జారీ చేశారు. అఖిల భారత సర్వీస్‌ రూల్స్‌ (డీఅండ్‌ఏ)–1969 ప్రకారం సస్పెండ్‌ చేయడానికి వీల్లేదని, కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని మహేశ్వర్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు.

ఇప్పటికే మహేశ్వర్‌రెడ్డి ఐపీఎస్‌ శిక్షణ పూర్తి చేశారని, పోస్టింగ్‌ అందుకోవాల్సిన దశలో నిరాధార ఆరోపణల ఆధారంగా ఆయనను సస్పెండ్‌ చేశారని చెప్పారు. నిబంధనల ప్రకారం ఓ క్రిమినల్‌ కేసు పెండింగ్‌ ఉందని చెప్పి సర్వీస్‌ నుంచి సస్పెండ్‌ చేయడానికి వీల్లేదని, అలాంటి కేసుల్లో 48 గంటల పాటు రిమాండ్‌లో ఉన్నప్పుడు మాత్రమే సస్పెండ్‌ చేయొచ్చని చట్టంలో ఉందన్నారు. భువన అనే యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మహేశ్వర్‌రెడ్డి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఆయనను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మ్యాన్‌కైండ్‌ ఫార్మా భారీ విరాళం

పారిశుధ్య కార్మికులకు కరోనా ఎఫెక్ట్!

త్వరలోనే ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్‌

‘కరోనా భయంతో అనవసర మందులు వాడొద్దు’

జిల్లాలో కలకలం రేపిన తొలి ‘కరోనా’ కేసు

సినిమా

అందుకే మేం విడిపోయాం: స్వరభాస్కర్‌

క‌రోనా వార్డులో సేవ‌లందిస్తోన్న న‌టి

మరోసారి బుల్లితెరపై బిగ్‌బాస్‌

ప్రభాస్‌, బన్నీ మళ్లీ ఇచ్చారు!

కరోనా: హీరో విజయ్‌ ఇంటిలో ఆరోగ్యశాఖ తనిఖీ

ఈసారైనా నెగెటివ్ వ‌స్తే బాగుండు: సింగ‌ర్‌