అరచేతిలో బస్సు గుట్టు!

5 Aug, 2014 03:40 IST|Sakshi
అరచేతిలో బస్సు గుట్టు!
  •     "FindBus@Hyd' యాప్‌ను విడుదల చేసిన రిక్తమ్ సంస్థ
  •      త్వరలో ఇతర పట్టణాలకూ విస్తరణ
  • సాక్షి, బంజారాహిల్స్: ‘మీరు బస్సు కోసం ఎదురు చూస్తున్నారా? అది ఏ రూట్‌లో వస్తోందో...ఎక్కడ ఉందో... మీరు ఉన్న చోటుకు వచ్చేందుకు ఎంత సమయం పడుతుందో తెలుసుకోవాలనుందా?... ఈ సమాచారం ఇక మీ అరచేతిలోనే ఉండబోతోంది. ఈ వివరాలన్నీ చిటికెలో మీ కళ్ల ముందు ప్రత్యక్షం కాబోతున్నాయి. దీని కోసం రిక్తమ్ టెక్నాలజీ కన్సల్టెంట్ ప్రై.లి. "FindBus@Hyd'పేరుతో ఓ మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించింది. ఈ సందర్భంగా సోమవారం తాజ్ బంజారాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిక్తమ్ టెక్నాలజీ డెరైక్టర్ సిద్ధార్థ కొంగర ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే...
     
    ‘హైదరాబాద్‌లో బస్సులో ప్రయాణించడమంటే కత్తిమీద సామే. ఓ వైపు విపరీతమైన ట్రాఫిక్, మరోవైపు అర్థం కాని బస్సు రూట్లు. ఎవరిని అడగాలో తెలియక సతమతమవుతుంటాం. ఇలాంటి సమస్యకు పరిష్కారం చూపించేందుకుసరికొత్త టెక్నాలజీతో ఉచితంగా సేవలను అందించేందుకు "Find-B-us-@-Hyd' యాప్‌ను రూపొందించాం. దీనికి ఇంటర్నెట్ సాయం అవసరం లేదు.
     
     ఐ ఫోన్, ఆండ్రాయిడ్ వాళ్లకే..

     ప్రస్తుతం ఐ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగించేవాళ్లకుమాత్రమే ఈ "FindBus@Hyd'యాప్‌ను వినియోగించుకునే వీలుంది. ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే.. http://bit.ly/findbushyd,ఐ ఫోన్ ఉంటే. http://bit.ly/findbushyd.ios లింక్‌ల నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలో అన్ని సెల్‌ఫోన్లలోనూ ఈ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తాం.
     
    ఇతర పట్టణాలకూ విస్తరిస్తాం

    మనం ఎక్కిన బస్సు ఎంత సమయంలో గమ్యస్థానానికి చేరుకుంటుంది?... టికెట్టు ధర ఎంత? వంటి వివరాలు తెలుసుకునేందుకు వీలుగా రెండు నెలల్లో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. అంతేకాకుండా విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కరీంనగర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ ఈ సేవల విస్తరణకు ప్రణాళికలు రచిస్తున్నాం’ అని చెప్పారు. విలేకరుల సమావేశంలో సెట్విన్ ఎమ్‌డీ సుభాష్ చంద్రబోస్, రిక్తమ్ టెక్నాలజీ ఎమ్‌డీ సిద్ధారాయ్ షింగ్‌శెట్టి, డెరైక్టర్ సిద్ధార్థ కొంగర, ఫైండ్‌బస్ యాప్ డెవలపర్లు రేవతి మీనంపల్లి, మౌనిక వంగాలా పాల్గొన్నారు.
     
     "FindBus@Hyd'యాప్‌తో ప్రధానంగా 4 రకాల సేవలను పొందవచ్చు.
     
     సెర్చ్ బై బస్
     ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతాన్ని ఎంటర్ చేస్తే చాలు. ఆ రూట్‌లో వెళ్లే బస్సుల  సమాచారం తెలుస్తుంది.
     
      సెర్చ్ బై బస్
     ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతాన్ని ఎంటర్ చేస్తే చాలు. ఆ రూట్‌లో వెళ్లే బస్సుల  సమాచారం తెలుస్తుంది.
     
     సెర్చ్ బై సోర్స్ అండ్ డెస్టినేషన్
     ప్రారంభ స్థానం, గమ్యస్థానాన్ని ఎంటర్ చేస్తే చాలు.. ఆ రూట్‌లో వెళ్లే బస్సుల నంబర్లు, మార్గమధ్యలో వచ్చే బస్ స్టాపుల వివరాలు, మారాల్సిన బస్సుల రూట్లు కూడా తెలుస్తాయి.
     
     సెర్చ్ బై రూట్
      ఏదైనా ఒక స్టాప్‌ను ఎంపిక చేసుకుంటే ఆ స్టాప్ మీదుగా వెళ్లే బస్సుల సమాచారం తెలుస్తుంది.
     
     స్టాప్ నియర్ మి

     మనకు దగ్గర్లో ఉన్న బస్ స్టాపులవివరాలు తెలుసుకోవచ్చు.
     

మరిన్ని వార్తలు