అలరించిన సంగీత విభావరి

21 Jul, 2014 00:43 IST|Sakshi

సాక్షి, సిటీ బ్యూరో:  స్వరాంజలి సాంస్కృతిక సంస్థ ఆధ్వ ర్యంలో  కేవీ మహదేవన్ స్వరాల తో నిర్వహించిన ‘ఝుమ్మంది నాదం’ సంగీత విభావరి ఆధ్యంతం ఆహూతులను అలరించింది. చిక్కడపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ టంపెట్ వాయిద్య కళాకారులు జీవన్ థామస్‌ను సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంగీత దర ్శకులు సాలూరి వాసురావు మాట్లాడుతూ పాడాలనే తపన ఉన్న ఎంతో మంది గాయనీగాయకులను ప్రోత్సహిస్తున్న స్వరాంజలి సంస్థ సేవలు అభినందనీయమన్నారు.

అనంతరం సన్మాన గ్రహీత జీవన్ థామస్ మాట్లాడుతూ పాట వెనకాల ఉన్న వాయిద్య కూర్పుని గుర్తించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరెందరో కళాకారులను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో సినీ సంగీత దర్శకులు జోస్యభట్ల, గాయకులు గజల్ శ్రీనివాస్, రచయిత మదన్‌మోహన్, సంస్థ అధ్యక్షులు కవితా చక్ర, ప్రదాన కార్యదర్శి సుధారాణి చల్లా, పలువురు గాయనీగాయకులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు