మరో అవినీతి చేప

1 May, 2015 02:04 IST|Sakshi

ఏసీబీకి చిక్కిన రిజిస్ట్రేషన్‌శాఖ సీనియర్ అసిస్టెంట్
- రూ.3,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన వైన
- పట్టించిన హైకోర్టు న్యాయవాది..
ఖమ్మం క్రైం:
కిందిస్థాయి ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోరుున సత్తుపల్లి ట్రాన్స్‌కో డీఈఈ సుదర్శన్ ఉదంతం మరవకముందే మరో అవినీతి చేప పట్టుబడింది. జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని పరిపాలన విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ జె.గణపతిరావు రూ.3,000 లంచం తీసుకుంటూ బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టు బడ్డాడు. కామేపల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన బెరైడ్డి సీతారాంరెడ్డి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు.

ఆయనకు సంబంధిం చిన వాల్యుడేషన్ సర్టిఫికెట్ కోసం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. రూ.100తో చలా నా కూడా చెల్లించాడు. ఈ సర్టిఫికెట్ ఇవ్వడం కోసం ఆ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జె.గణపతిరావు రూ.3వేలు లం చం అడిగాడు. సీతారాంరెడ్డి రూ.100 చలానాతో వచ్చే వ్యాలిడేషన్ సర్టిఫికెట్‌కు రూ.3వేలు లంచం ఏమిటని ప్రశ్నించగా.. లంచం ఇస్తే కాని సర్టిఫికెట్ ఇవ్వనని సీనియర్ అసిస్టెంట్ తెగేసి చెప్పాడు. సీతారాంరెడ్డి ఏసీబీ సిబ్బందిని ఆశ్రయించారు. వారు పథకం ప్రకారం లంచం తీసుకుంటున్న గణపతిరావును అరెస్ట్ చేసి ఆయన వద్ద  ఉన్నరూ.3వేలు స్వాధీనం చేసుకున్నారు.

పూర్వాపరాలు..
హైకోర్టు లాయర్ సీతారాంరెడ్డికి ముగ్గురు కుమారులు. వీరిలో గౌతమ్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నకుమారుడు అరుణ్‌రెడ్డి సినీ హీరోగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పెద్దకుమారుడు గౌతమ్‌రెడ్డికి,  ఆయన భార్యకు మధ్య ఇటీవల వివదాలు పొడచూపారుు. సీతారాంరెడ్డి కుటుంబంపై కేసులు అయ్యాయి. అమెరికాలో ఉంటున్న ఆయన ఇద్దరు కుమారులు ఇక్కడున్న వారి ఆస్తులకు సంబంధించి తండ్రి పేరు మీద  ఆదేశం నుంచి పవర్ ఆఫ్ అటార్నీ చేయించారు.

దీనికి సంబంధించి రూ.100 చలానా కట్టి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వాల్యుడేషన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంది. దీనికోసం సీతారాంరెడ్డి ఈనెల 13న చలానా కట్టారు. వాల్యుడేషన్ సర్టిఫికెట్ కోసం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయూనికి వచ్చారు. దీనికి సంబంధించిన విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న జె. గణపతిరావుని సంప్రదించారు. ఆయన రూ.3,000 లంచం అడిగారు. ఖంగుతిన్న సీతారాంరెడ్డి రూ.100 చలనా కడితే వచ్చే సర్టిఫికెట్ కోసం రూ.3,000 ఇవ్వడమేంటని ప్రశ్నించారు. తాను హైకోర్టు న్యాయవాదినని కూడా చెప్పారు. అవన్నీ పక్కనబెట్టు డబ్బులిస్తే గానీ సర్టిఫికెట్ ఇవ్వనని సీనియర్ అసిస్టెంట్ గణపతిరావు తెగేసి చెప్పారు. బాధితుడు జిల్లా రిజిస్ట్రార్‌ను కలవడానికి ప్రయత్నించారు. వరంగల్ ఇన్‌చార్జి సుభాషిణి జిల్లాకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తుండటంతో ఆమె అందుబాటులో లేరు. వాస్తవానికి 18వ తేదీనే రిజిస్ట్రార్ ఈ సర్టిఫికెట్‌పై సంతకం చేశారు. సీతారాంరెడ్డి వస్తే ఇవ్వమని సీనియర్ అసిస్టెంట్‌కు అప్పగించి వెళ్లారు. ఆయన రూ.3,000 ఇస్తేనే పనవుతుందని ఈనెల 24వ తేదీ నుంచి తిప్పించుకుంటున్నాడు. గత్యంతరం లేక బాధితుడు ఏసీబీని ఆశ్రరుుంచారు.

ఏసీబీ నిఘా వేసిందిలా..
రూ.500 నోట్లు ఆరింటికి ఏసీబీ సిబ్బంది రసాయనం పూశారు. వాటిని సీతారాంరెడ్డి చేతిలో పెట్టి కార్యాలయంలో పలికి పంపించారు. రూ.3,000 లంచం తీసుకుంటుండగా ఏసీ బీడీఎస్పీ సాయిబాబా దాడి చేసి పట్టుకున్నారు. గణపతిరావు గతంలో సత్తుపల్లి, కూసుమంచి తదితర ప్రాంతాల్లో పనిచేశారని ఆయనపై అప్పట్లోనూ అవినీతి ఆరోపణలున్నాయని ఏసీబీ సిబ్బంది తెలిపారు. ఆయన పదవీ విరమణకు దగ్గరలో ఉన్నారని రిజిస్ట్రేషన్ సిబ్బంది పేర్కొన్నారు.ఈ దాడిలో ఏసీబీ సీఐ వెంకటేశ్వర్లు, పాపారావు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు