గొర్రెల మందను వీడని మృత్యువు

1 Apr, 2018 10:05 IST|Sakshi
మృతి చెందిన గొర్రెలు

మరో 30 జీవాల మృత్యువాత 

రెండు రోజుల్లో 91 గొర్రెలు..

మిర్యాలగూడ రూరల్‌ :  పాలమూరు జిల్లా గొర్రెల మందను మృత్యు వీడడం లేదు. మూడు నెలల క్రితం నల్లగొండ జిల్లాలోని సాగర్‌ ఆయకట్టుకు వేసవిలో మేత కోసం11 మంది యజమానులు తమకున్న 3000 గొర్రెలతో బయలుదేరారు. వారు శుక్రవారం మిర్యాలగూడ మండలం  తుంగపహాడ్‌ గ్రామ శివారుకు చేరుకున్నారు. అక్కడ మందలోని గొర్రెలు అనారోగ్యనికి గురై 60 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ పశు సంవర్థకశాఖ సిబ్బంది పశు వైద్యులు చికిత్స అందింస్తున్నప్పటికీ గొర్రెల  మరణాన్ని అరికట్టే పరిస్థితి లేకపోయింది. æ రెండవ రోజు శనివారం మరి 31గొర్రెలు మృతిచెందాయి.  రక్త నమూనాలు, శరీరంలో భాగాల ముక్కలు షాంపిల్స్‌ హైదరాబాద్‌ వెటర్నరీ బయోజికల్‌ ల్యాబ్‌కు పంపించారు. వాటి ఫలితాలు రావాలంటే కనీసం 48 గంటలు పడుతుందని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. కాగా నల్లగొండకు పంపిన ల్యాబ్‌ టెస్ట్‌ ఫలితాల ప్రకారం విష ఆహారం, అజీర్ణ సమస్యతో పాటు చిటక రోగం, పుర్రు రోగం సోకినట్లు మిర్యాలగూడ ఏడీ వెంకట్‌రెడ్డి తెలిపారు. 
కొనసాగుతున్న వైద్యశిబిరం 
మిర్యాలగూడ , త్రిపురారం వెటర్నరీ వైద్య బృదం  గొర్రెలకు చికిత్స అందస్తున్నారు. వ్యాధి నిరోధక మందులు, సెలెన్‌ అందిస్తున్న కంట్రోలు కాకపోవడంతో ఇటు వైద్యులు, అటు గొర్రెలు మందల యజమానులు అందోళన చెందుతున్నారు.
కానరాని స్పందన 
కాగా నాలుగు రోజులుగా గొర్రెలు నిరంతరం మరణిస్తున్నప్పటికీ అధికారులెవరూ స్పందించక పోవడం బాధాకరం. గొర్రెలనే నమ్ముకుని జీవ నం సాగిస్తూ జిల్లా దాటి వచ్చి ఇక్కడ అకస్మాత్తుగా జీవాలు మృతి చెందుతుండడంతో కాపరులు ఏమి పాలుపోక ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు