రుణం.. అందని ద్రాక్షే!

24 Sep, 2018 13:32 IST|Sakshi

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: బీసీ కార్పొరేషన్‌లో రుణాలు అందని ద్రాక్షగా మారాయి. గత రెండేళ్లుగా రుణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలే పంపకపోవడం గమనార్హం. 2017–18 సంవత్సరాలకు బీసీ అభ్యర్థుల నుంచి రుణాల కోసం దర ఖాస్తులను ఆహ్వానించింది. దీంతో జిల్లావ్యాప్తంగా మొత్తం 32వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతగా రూ.50వేలు వందశాతం «సబ్సిడీ కోసం దరఖాస్తులు చేసుకున్న 86 మందికి అధికారులు రుణాలు మంజూరు చేశారు. మిగతా వారికి కూడా రుణాలు ఇచ్చేందుకు అధికారులు సకరత్తు చేస్తున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత డొల్లగా మారిందనే విమర్శలున్నాయి.

గతంలో జిల్లాస్థాయి కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసేది. ప్రస్తుతం పూర్తిగా మండ ల స్థాయి అధికారులే చేస్తున్నారు. ఎంపీడీఓతో పాటు డీపీడీఓ, బ్యాంకు అధికారులు, రెవెన్యూ అధికారులతో కూడిన కమిటీ ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. చాలా మండలాల్లో అధికారులు లబ్ధిదారుల ఎంపిక విషయంలో నిబంధనలు పాటించలేదన్న వాదన బలంగా
వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రోజుల తరబడి ఎదురుచూసిన జిల్లాలోని నిరుద్యోగుల ఆశలపై బీసీ కార్పొరేషన్‌ నీళ్లు చల్లినట్లైంది. అధికారులు తమకు ఇష్టమొచ్చినట్లు ఎంపిక చేశారని, మండల నాయకులు చెప్పిన వారికే రుణాలు ఇచ్చారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

లబ్ధిదారుల ఎంపిక విధానం  
బీసీ కార్పొరేషన్‌ వివిధ స్కీంలకు దరఖాస్తు చేసుకున్న వారికి వ్యక్తిగత రుణాలతో పాటు, కార్పొరేషన్‌ రుణాలు ఇస్తుంది. ముందుగా దరఖాస్తులను అభ్యర్థులు ఆన్‌లైన్‌ పద్ధతిలో చేసుకుని అనంతరం, మండల ఎంపీడీఓ కార్యాలయంలో వాటిని సమర్పించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా గ్రామాల వారి వివరాలను సేకరించిన మండల స్థాయి కమిటీ గ్రామాలలో లబ్ధిదారుల ఎంపికను గ్రామసభల ద్వారా ఎంపిక చేస్తుంది. ఇందులో అభ్యర్థులు ఆర్థిక, సామాజిక, వ్యాపారం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికపై నిబంధనలు ప్రత్యేకంగా జారీ చేయలేదు. ఈ క్రమంలో లబ్ధిరులను ఎలా ఎంపిక చేస్తారన్న విషయంలో కూడా స్పష్టత లేకుండా పోయింది.

స్థానిక నాయకులు చెప్పిన వారికే రుణాలు  
జిల్లాలో చాలా మండలాల్లో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందన్న విషయం దరఖా స్తుదారులకు తెలియదు. గ్రామసభల ద్వారా ఎంపిక చేస్తారన్న విషయం మాత్రమే తెలుసు. సభలు ఎప్పుడు నిర్వహిస్తారో, ఎంపిక ఎలా చేస్తారన్న విషయం స్పష్టత లేదు. ఈ విషయంలో అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలున్నాయి.  స్థానిక నాయకులు చెప్పిన వారినే ఏకపక్షంగా ఎంపిక చేశారని, పూర్తి స్థాయి లో ఏ గ్రామంలో కూడా గ్రామసభలు నిర్వహించలేదని అంటున్నారు. దరఖాస్తుదారులకు అధికారులు మొండిచేయి చూపారని విమర్శిస్తున్నారు.

1,360 మంది లబ్ధిదారులు  
జిల్లా వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్‌ రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న మొత్తం లబ్ధిదారులు 1,360 మందిని ఎంపిక చేయాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు సూచించింది. వివిధ స్కీంల కింద రూ.6.80 కోట్లను కేటాయించింది. ఇందులో రూ. 50వేలు వందశాతం సబ్సిడీ కోసం దరఖాస్తులు చేసుకున్న 86 మందికి అందించేందుకు ప్రభుత్వం రూ.43లక్షలు  విడుదల చేసింది. వీటితో పాటు రెండో విడతగా 243 మంది లబ్ధిదారుల కోసం రూ.1.21.50 కోట్లలో బడ్జెట్‌ కేయించారు. వీటికోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయి జిల్లా అధికారుల వద్దకు ఫైల్‌ వెళ్లింది. ఈ క్రమంలో మొ త్తం ఇప్పటివరకు 329 మంది లబ్ధిదారులకు రుణా లు ఇచ్చేందుకుప్రక్రియపూర్తయ్యింది.1.031 మంది లబ్ధిదారులకు ఇంకా రుణాలు మంజూరుకావాల్సి ఉంది. దీనికోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు.
 
సంఘాల రుణాలపై లేని స్పష్టత  
వివిధ ఫెడరేషన్‌ల కింద రూ.50వేల నుంచి రూ.10లక్షల వరకు రుణాల కోసం 32వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సంఘాలుగా ఏర్పడిన వారూ ఉన్నారు. మొదటి విడతగా కేవలం రూ.50వేలకు మాత్రమే ప్రభుత్వం రుణా లు ఇస్తుంది. ఎక్కువ మొత్తంలో «రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, సంఘాల తరపున దరఖాస్తు చేసుకున్న వారికి ఎప్పుడు రుణాలు ఇస్తారో అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.

మరిన్ని వార్తలు