నగరంలో పలుచోట్ల సీబీఐ దాడులు

3 Jan, 2020 00:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఓ జాతీయ బ్యాంక్‌కు చెందిన అధికారులతోపాటు ప్రైవేటు మెడికల్‌ ల్యాబ్‌ ఉద్యోగుల ఇళ్లలో సీబీఐ గురువారం సోదాలు నిర్వహించింది. కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తికి సంబంధించిన ఫోర్జరీ డాక్యుమెంట్లతో సదరు బ్యాంకులో కోట్లాది రూపాయల రుణాలు తీసుకున్నారనే అ భియోగాలపై ఇటీవల సీబీఐలో కేసు నమోదైంది.  దర్యాప్తులో భాగంగా ఆ బ్యాంకు ఉన్నతాధికారులు, ల్యాబ్‌ ఉద్యోగుల ఇళ్ల పై దాడులు చేసి ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు