నిఘానే ‘లక్ష్యంగా..!

9 Sep, 2019 11:00 IST|Sakshi

సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో టెక్నాలజీ వినియోగం దిశగా అడుగులు

సైబరాబాద్‌లో 96 వేలు, రాచకొండలో 90,700

సీసీ కెమెరాల బిగింపు మరో రెండు నెలల్లో లక్ష సీసీ కెమెరాలు

సాక్షి,సిటీబ్యూరో: ఏప్రిల్‌ 19 రాత్రి సమయంలో అల్వాల్‌లోని అక్సిజన్‌ అర్కెడ్‌ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడిన దొంగతలు ఇంటి తాళాలు పగులగొట్టి రూ.24 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఈ బిల్డింగ్‌లోని మెట్ల వద్ద, పార్కింగ్‌ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నిందితుల ఫొటోలు, వీడియోలు రికార్డయ్యాయి. కానీ వారి ముఖానికి మాస్క్‌లు ధరించడంతో గుర్తిం చడం కష్టమైంది. అయితే చోరీ చేసి తిరిగి వెళుతున్న దారిలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో వారి ముఖాలు చిక్కాయి. దీంతో వారిని రెండు వారాల వ్యవధిలోనే అరెస్టు చేసి సొత్తు స్వాధీ నం చేసుకొని నిందితులను జైలుకు పంపారు.

ఆగస్టు 20న సరూర్‌నగర్‌ ఠాణా పరిధిలోని బైరాంగూడలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ నుంచి ఓ చైన్‌స్నాచర్‌ బంగారు గొలుసు తెంచుకొని బైక్‌పై పరారయ్యాడు. అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా కొత్తపేటలోని ఓ సూపర్‌ మార్కెట్‌లో పనిచేసే హర్యానా వాసి కుషరియా దతారామ్‌గా గుర్తించి ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు వారం రోజుల వ్యవధిలో అరెస్టు చేశారు.  ఈ రెండు కేసుల్లోనే కాదు వందల కేసుల్లో నిందితులను గుర్తించడమే కాకుండా వారికి జైలు శిక్షలు పడేలా న్యాయస్థానంలో సాంకేతిక సాక్ష్యంగా ఉపయోగపడుతున్న ఈ సీసీటీవీ కెమెరాలను అవశ్యకతను గుర్తించిన సైబరాబాద్, రాచకొండ పోలీసులు ‘లక్ష’ం వైపుగా సాగుతున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చే మాదాపూర్, శంషాబాద్, బాలానగర్‌ జోన్, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఎల్‌బీనగర్, మల్కాజ్‌గిరి, యాదాద్రి జోన్‌లో ఈ సీసీ కెమెరాల బిగింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఓవైపు నేను సైతం ప్రాజెక్ట్, కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్‌ల ద్వారా ఈ సీసీ కెమెరాల సంఖ్య దాదాపు ఇరు కమిషనరేట్ల అధికారులు లక్ష చేరువలోకి తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు సైబరాబాద్‌లో 96 వేలు, రాచకొండలో 90,700 సీసీ కెమెరాలను బిగించారు. అయితే, నేను సైతం ప్రాజెక్టు ద్వారానే అధిక నిఘానేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) సహకారంతో బడా ఐటీ కంపెనీలు ముందుకొచ్చి పోలీసుల నేను సైతం ప్రాజెక్టుకు విరాళాలు ఇస్తున్నారు. అంతేగాకుండా సీసీ కెమెరాల నిర్వహణకు కూడా కొన్ని కంపెనీలు ఆర్థిక సాయం ఇస్తూ నేర రహిత సమాజంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. 

‘చాయ్‌ పే చర్చ’ ద్వారా జాగృతి
లక్షల్లో ఉద్యోగులు పనిచేసే ఐటీ కారిడార్‌లోనూ సీసీటీవీ కెమెరాలను మరింత పెంచేందుకు సైబరాబాద్‌ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్‌సీఎస్‌సీలో సభ్యులుగా ఉన్న ఐటీ కంపెనీలను పోలీసు కమిషనర్‌ వీసీ సజ ్జనార్‌ ‘చాయ్‌ పే చర్చ’ కార్యక్రమం ద్వారా సీసీటీవీ అవశ్యకతను వివరిస్తున్నారు. కంపెనీలతో పాటు రహదారులపై ఏర్పాటు చేసే సీసీ టీవీ కెమెరాల ద్వారా ఎక్కడ ఏం జరిగినా తెలుస్తుందని చెబుతున్నారు. ఫలితంగా ప్ర స్తుతం ఐటీ కారిడార్‌లో ఉన్న 214 సీసీటీవీ కెమెరాల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు శంషాబాద్‌ జోన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ సీసీటీవీ కెమెరాల ఉండేలా చొరవ చూపుతున్నారు. వచ్చిన విరాళాలతో సైబరాబాద్‌ ఐటీసెల్‌ విభాగాధిపతి పి.రవిప్రసాద్‌ ఆధ్వర్యంలో పాత సీసీటీవీ కెమెరాల నిర్వహణతో పాటు కొత్త సీసీటీవీ కెమెరాల ఏర్పాటు బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. 

‘మహా’ కమిషనరేట్‌లో నిఘా
విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్ద కమిషనరేట్‌గా ఉన్న రాచకొండ పరిధిలో ఎల్‌బీనగర్, మల్కాజ్‌గిరి, యాదాద్రి లా అండ్‌ అర్డర్‌ జోన్‌లు ఉన్నాయి.
పట్టణం, గ్రామీణ ప్రాంతాలు మిళితమైన ఈ ప్రాంతంలో నేరాలు నియంత్రించేందుకు సీసీటీవీల అవసరాన్ని తొలినాళ్లలోనే రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ గుర్తించారు. ఆయా జోన్లలో కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు, నేను సైతం సీసీటీవీ కెమెరాలను బిగింపును ఆయా జోన్‌ల డీసీపీలకు అప్పగించారు. ఈ సీసీటీవీ కెమెరాలు చైన్‌ స్నాచింగ్‌లు, దొంగతనాలు, చెడ్డీ గ్యాంగ్‌ కదలికలతో పాటు సంచలనాత్మక హత్య కేసుల్లో నిందితులను ఈజీగా పోలీసులకు పట్టిస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్‌లో అత్యంత ప్రధానమైన యాదాద్రి ఆలయం ఉండటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు జరుగుతుండటంతో ఐటీసెల్‌ విభాగాధిపతి ఎం.శ్రీధర్‌రెడ్డి పర్యవేక్షణలో జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.  

నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు
రెండు కమిషనరేట్ల పరిధిలోని నిమజ్జనాలు జరిగే చెరువుల వద్ద 305 సీసీ కెమెరాలు తాత్కాలికంగా బిగిస్తున్నారు. సైబరాబాద్‌లోని హస్మత్‌పేట చెరువుత, పత్తికుంట చెరువు, మల్లెచెరువు, ఐడీఎల్‌ చోఎరువు, ప్రగతినగర్‌ చెరువుల వద్ద 100 సీసీటీవీ కెమెరాలు, రాచకొండలోని సరూర్‌నగర్, ఎదులాబాద్, ఇమాంగూడ, కాప్రా, సఫిల్‌గూడ చెరువుల వద్ద 205 సీసీ కెమెరాలు వినియోగిస్తున్నారు. ‘రాచకొండలో నిమజ్జనం జరిగే ప్రాంతాలతో పాటు 35 సున్నితమైన ప్రదేశాల్లో కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. వివిధ జంక్షన్లలో ఉన్న సీసీటీవీ కెమెరాలను డీజీపీ కార్యాలయానికి, రాచకొండ సీపీ కార్యాలయానికి అనుసంధానిస్తున్నాం’ అని రాచకొండ ఐటీసెల్‌ విభాగాధిపతి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

నేరాల నియంత్రణ
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం. ఈ నిఘా నేత్రాలు సంచలనాత్మక కేసులు, దొంగతనాలు, చైన్‌స్నా చింగ్‌లు, హత్యలు దితర నేరాల్లో నిందితులకు శిక్షలు పడేలా చేస్తున్నాయి. హజీపూర్‌ ఘటనతో యాదాద్రి జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నాం. చాలా గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. – మహేష్‌ భగవత్,రాచకొండ పోలీసు కమిషనర్‌

సీసీటీవీలకు విరాళం ఇవ్వాలనుకుంటే...
సైబరాబాద్‌: 949061744కు వాట్సాప్‌ చేయవచ్చు. లేదా
itcell& cyb@tspolice.gov.in మెయిల్‌ చేయవచ్చు.
 రాచకొండ: 949061 7111కు వాట్సాప్‌ చేయవచ్చు. లేదా ఆయా పోలీసు స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలను సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు