ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు

31 Aug, 2014 03:07 IST|Sakshi
ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు

- ఎంపీ ఫండ్ నుంచి రూ.25 లక్షలు
- కార్పొరేటర్లతో ఎంపీ కవిత సమావేశం
నిజామాబాద్ అర్బన్ : ఇందూరు నగరంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ కల్వకుంట్ల కవిత కార్పొరేటర్లకు సూచించారు. శుక్రవారం తన నివాసంలో కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడు తూ.. నగరంలో చైన్‌స్నాచింగ్‌లు జరుగుతున్నాయని, వీటి నివారణకు ఇతర వాటికి కూడా ఉపయోగపడేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు  ముఖ్యమన్నారు.  కార్పొరేటర్లు తమ డివిజన్లలో ప్రధాన కూడళ్లను గుర్తిం చి సీసీ కెమెరాల ఏర్పాటుకు కార్పొరేషన్‌కు ప్రతి పాదనలు ఇవ్వాలన్నారు.  

సీసీ కెమెరాల ఏర్పాటుకు సం బంధించి జిల్లా ఎస్పీతో మాట్లాడుతానని ఎంపీ పేర్కొన్నారు. ఈ ఏర్పాటుకు ఎంపీ ఫండ్ కింద రూ. 25 నుంచి సుమారు రూ.50 లక్షల వరకు నిధులు అం దిస్తానని అన్నారు.  కార్పొరేషన్ అభివృద్ధికి సం బంధించి కృషి చేయాలన్నారు. మాస్టర్ ప్లాన్ రూ పొం దించి నగర అభివృద్ధికి పాటుపడాలన్నారు. వీధి దీపా ల ఏర్పాటు, ప్రధాన కూడళ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. కార్పొరేషన్ అభివృద్ధికి సీఎం ఫండ్ నుంచి అధిక నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేయాల న్నారు.  సమావేశంలో  మేయర్ ఆకుల సుజాత ,కార్పొరేటర్లు విశాలినిరెడ్డి, సూదం లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు