సంతాన యోగం!

11 Mar, 2020 03:09 IST|Sakshi

వీర్యకణాలు చురుగ్గా మారే అవకాశం 

ఎయిమ్స్, సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలు మరీ ముఖ్యంగా పురుషులు యోగా సాధన చేసేందుకు మరో బలమైన కారణాన్ని ఆవిష్కరించారు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు. అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా తగ్గిపోతున్న పురుషుల వీర్యం నాణ్యత పెంచేందుకు యోగా ఉపయోగపడుతుందని సీసీఎంబీ, ఢిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) సంయుక్తంగా చేసిన పరిశోధన స్పష్టం చేసింది.

మానవ జన్యు వ్యవస్థపై వాతావరణం ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది తెలిసిందే. అనారోగ్యకర జీవనశైలి, దురలవాట్ల కారణంగా డీఎన్‌ఏలో రసాయన మార్పులు చో టుచేసుకుని వీర్యం నాణ్యత తగ్గుతుందని కూ డా వింటుంటాం. ఈ మార్పులను యోగాతో అ ధిగమించొచ్చని తాజా అధ్యయనం చెబుతోంది. ఆండొలోగియా జర్నల్‌ తాజా సంచికలో ప్ర చురితమైన దాని ప్రకారం వంధ్యత్వ సమస్యల తో బాధపడుతున్న పురుషులు యోగా ఆధారిత జీవనశైలి అలవర్చుకుంటే వీర్యకణాలు చురు గ్గా మారడంతో పాటు వీర్యంపై ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ కూడా తగ్గుతుంది. తద్వారా సంతానం కలిగేందుకు ఉన్న అవకాశాలు పెరుగుతాయి.

సీసీఎంబీలో పరిశీలన..
ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యశాలలో వంధ్యత్వ సమస్యలకు చికిత్స పొందుతున్న కొంతమందిని ఎంచుకుని తాము అధ్యయనం చేశామని సీసీఎంబీ శాస్త్రవేత్త సురభి శ్రీవాత్సవ తెలిపారు. వీరు రోజుకు గంట చొప్పున వేర్వేరు ఆసనాలు వేయడంతో పాటు ప్రాణాయామం, ధ్యానం వంటి యోగా క్రియలను అనుసరించారు. యోగా కార్యక్రమంలో చేరే ముందు.. ఆ తర్వాత వీరి వీర్యాన్ని పరిశీలించగా ఆసక్తికరమైన మార్పులు కనిపించాయని శ్రీవాత్సవ వివరించారు. 400 జన్యువులు ఆన్‌/ఆఫ్‌ అయ్యేందుకు కీలకమైన మిథైలోమ్‌ను యోగా ప్రభావితం చేస్తున్నట్లు స్పష్టమైందన్నారు.

వీటిల్లో పురుషుల సంతాన లేమికి వీర్య ఉ త్పత్తికి ఉపయోగపడే జన్యువులు ఉన్నాయి. ఈ అధ్యయనంలో గుర్తించిన జన్యువులపై మరి న్ని పరిశోధనలు జరపడం, వీర్యంపై యోగా ప్రభావంపై విస్తృత అధ్యయనం ద్వారా వంధ్య త్వ సమస్యలను అధిగమించేందుకు మెరుగైన మార్గం లభిస్తుందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. యోగా అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఇద్దరు ఏడాది తిరగకుండానే తండ్రులు అవుతుండటం విశేషం. 

మరిన్ని వార్తలు