సంక్షేమంపై నిఘా నేత్రం

26 Oct, 2018 17:16 IST|Sakshi

వసతి గృహాల్లో సీసీ కెమెరాలు 

జిల్లాలోని 22హాస్టళ్లలో ఏర్పాటు 

వార్డెన్లపై మరింత బాధ్యత 

అక్రమాలకు చెక్‌పడే అవకాశం 

సాక్షి, అమరచింత: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో నిఘాను మరింత పటిష్టం చేయనున్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులతో పాటు వార్డెన్లు, సిబ్బంది పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భా గంగానే జిల్లాలోని 18 ఎస్సీ హాస్టళ్ల పాటు నా లుగు కళాశాల విద్యార్థుల హాస్టళ్లలో సైతం సీసీ కె మెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో రోజువారి విద్యార్థుల దైనందిన పరిస్థితులను తె లుసుకోవడమే కాకుండా వారు అనుసరిస్తున్న ప ద్ధతులను మానిటరింగ్‌ చేసే అవకాశం ఉండటంతో హాస్టల్‌ వార్డెన్లకు మరింత బాధ్యత పెరిగినట్లయింది.  

మానిటరింగ్‌కు పెద్దపీట 
జిల్లాలో 18 సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాల్లో 2,100 మంది విద్యార్థులు సాగిస్తున్నారు. కళా శాల విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన నాలుగు హాస్టళ్లలో 500మంది విద్యార్థులు చదువుతున్నా రు. రోజువారీగా  విద్యార్థుల హాజరుతో పాటు అ ల్పాహారం, రాత్రి భోజనం, ట్యూషన్ల పనితీరును తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించారు. అంతేకాకుండా నిత్యకృత్యాలు, ఆటాపాటలతో పాటు విద్యార్థు లు గొడవపడుతున్న తీరును నేరుగా తెలుసుకుని మానిటరింగ్‌ చేసేందుకు వార్డెన్లకు అవకాశం ఉంటుంది.

 
హాస్టల్‌లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరా 

అక్రమాలకు చెక్‌పడేనా? 
హాస్టళ్లలో రోజువారీగా విద్యార్థులు హాజరయ్యే సంఖ్యను బట్టి వారికి వండిపెట్టేందుకు బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె తదితర వాటిని సరఫరా చేస్తారు. అయితే గతంలో ఈ సరుకులు సగం పక్కదారిపట్టేవి. విద్యార్థుల సంఖ్యను త ప్పుగా చూపుతూ అక్రమాలకు పాల్పడేవారు. ప్ర భుత్వం సరఫరా చేసిన ఆహారధాన్యాలు వసతి గృహాల నుంచి బయటికి వెళ్లకుండా వ్యవస్థ ద్వా రా కట్టుదిట్టమైంది. గతంలో విద్యార్థుల సంఖ్యను బేరీజు వేసుకుని తూతూమంత్రంగా హాస్టళ్ల నిర్వహణను కొనసాగించిన పలువురు వార్డెన్లకు సీసీ కెమెరాల ఏర్పాటు, బయోమెట్రిక్‌ విధానం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లయింది.  

వసతులు బాగున్నాయి.. 
అమరచింత ఎస్సీ హాస్టల్‌లో 10వ తరగతి చదువుకుంటున్నాను. గతనెలలో హాస్టల్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. సిబ్బంది పనితీరులో మార్పులు రావడంతో సకాలంలో ఆహారం అందిస్తున్నారు.  దీంతో పూర్తిస్థాయిలో ట్యూషన్లు, చదువులు కొనసాగుతున్నారు. – నాగరాజు, హాస్టల్‌ విద్యార్థి, రాంపూర్‌ 

ప్రహరీ లేక ఇబ్బందులు  
అమరచింత ఎస్సీ హాస్టల్‌లో 10వ తరగతి చదువుకుంటున్నాను. గతేడాది బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం సీసీకెమెరాలను ఏర్పాటు చేయడం బాగుంది. రాత్రివేళ హాస్టల్లో విషపురుగులతో పాటు పశుసంచారం ఎక్కువగా ఉంది. అధికారులు స్పందించి ప్రహరీ ఏర్పాటుచేయాలి.   – సాయికుమార్,హాస్టల్‌ విద్యార్థి, కిష్ణంపల్లి
 

మానిటరింగ్‌ పెరిగింది.. 
హాస్టళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా మానిటరింగ్‌ వ్యవస్థ తీరు మెరుగుపడింది. కార్యాలయం నుంచే టీవీలో సీసీకెమెరాల ద్వారా వస్తున్న దృశ్యాలను చూస్తూ విద్యార్థులను దిశానిర్దేశం చేస్తూ ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించగలుగుతున్నాం.   – బెనర్జీ, హాస్టల్‌ వార్డెన్, అమరచింత 

సత్ఫలితాలు సాధించడానికి కోసమే.. 
సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్‌లో గతనెల సీసీ కెమెరాలను ఏర్పాటుచేశాం. కలెక్టర్‌ ఆదేశాలతో 18 వసతిగృహాల్లో వాటిని బిగించాం. పదో తరగతి విద్యార్థుల ఫలితాలతో పాటు కళాశాల విద్యార్థుల ఫలితాలను పెంపొందించడానికి నిత్యసాధన చేయిస్తున్నాం.  -జీపీ వెంకటస్వామి, ఏఎస్‌ఈడీఓ, వనపర్తి  

మరిన్ని వార్తలు