కొత్త ‘లెక్కలు’ పంపండి!

15 Nov, 2019 03:36 IST|Sakshi

కలెక్టర్లను కోరిన రాష్ట్ర జనగణన విభాగం డైరెక్టర్‌

సాక్షి, హైదరాబాద్‌: జనాభా లెక్కల సేకరణకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. 2021 జనాభా లెక్కల కోసం వివరాలను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో 2011 జనాభా లెక్కల అనంతరం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల పునర్విభజనకు సంబంధించిన సమాచారాన్ని పంపాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర జనగణన వ్యవహారాల డైరెక్టర్‌ ఇలంబర్తి లేఖ రాశారు. 2011 అనంతరం రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే జిల్లాల పునర్విభజన నేపథ్యంలో విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో రెండు జిల్లాల కేంద్రాలు, 58 మండలాలు, 460 గ్రామాల పేర్లు కనిపించకుండా పోవడం, కొన్ని పేర్లు మార్పులు జరగడం వంటి వాటిని గుర్తించిన∙కేంద్ర జనగణనశాఖ డైరెక్టర్‌.. పొరపాటున మాయమైతే వెంటనే నోటిఫై చేయాలని రాష్ట్రప్రభుత్వానికి గతంలోనే లేఖ రాసింది. 2018 జనవరి 1 నుంచి మారిన గ్రామాలు, మండలాలు, పట్టణాలు, జిల్లాల సరిహద్దులను గుర్తించి 2019 అక్టోబర్‌ 31 వరకు విడుదల చేసిన తర్వాత గెజిట్‌ నోటిఫికేషన్‌ల కాపీలను కూడా పంపాలని ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా