బ్రిటన్‌ సహకారంతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ 

29 Feb, 2020 04:01 IST|Sakshi

రాష్ట్రంలో ఏర్పాటుపై వ్యవసాయ శాఖ చర్చలు

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యాన పంటల కోత అనంతర యాజమాన్య పద్ధతులకు బ్రిటన్‌–భారత ప్రభుత్వ సహకారంతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు తెలంగాణలో అవకాశాలపై ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చర్చ జరిగింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎన్‌.జనార్ధన్‌ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్‌ ఎల్‌.వెంకట్రామిరెడ్డిలతో బ్రిటిష్‌ హైకమిషన్‌కు సం బంధించిన జేస్‌ దీప్‌ జస్వాల్‌ ఆధ్వర్యంలో 9మంది ఉద్యానరంగ నిపుణుల ప్రతినిధుల బృందం సమావేశమైంది.

ఈ సందర్భంగా ఎల్‌.వెంకట్రామి రెడ్డి తెలంగాణలో ఉద్యాన పంటల విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతలను వివరించారు. రాష్ట్రంలో మామిడి, బత్తాయి, నిమ్మ, కూరగాయలు, పసుపు, మిరప వంటి పంటల కోత అనంతర నష్టాలను తగ్గించ టానికి, నిల్వ సామర్థ్యం పెంచటానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, కోల్డ్‌ చైన్‌ అభివృద్ధి, ఎగుమ తి చేయటానికి అవసరమైన సదుపాయాలు, అంతర్జాతీయ మార్కెటింగ్‌కు అవసరమైన నాణ్యత ప్ర మాణాలు, అవకాశాలు మొదలైన వాటిపై చర్చిం చామని తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యాన విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్‌ ఎ.భగవాన్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు