ఆన్‌లైన్‌ పాఠాలకు చేతులు కలిపిన సెంట్రల్‌బుక్స్, ఎడ్యుబ్రిక్స్‌

1 Jul, 2020 21:29 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: కరోనా నేపథ్యంలో విద్యార్ధులకు డిజిటల్‌ విధానంలో పాఠాలు చెప్పడానికి సెంట్రల్‌బుక్స్, ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ సంస్ధ ఎడ్యుబ్రిక్స్‌ టెక్నాలజీ సంస్ధలు చేతులు కలిపాయి. ఇందులో భాగంగా సీబీఎస్‌ఈ. ఐసీఎస్‌ఈ, స్టేట్‌బోర్డ్‌ విధానాల్లో ఆన్‌లైన్‌ పాఠాలను అనుసంధానిస్తున్నట్లు ఎడ్యుబ్రిక్స్ సీఈవో సైజు అరవింద్, సెంట్రల్‌బుక్స్‌ సీఈవో సుధీర్ ముంగాలా పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఏపీ. తెలంగాణా రాష్ట్రాల్లో కనీసం 1మిలియన్‌ విద్యార్ధులకు పాఠాలు చెప్పాలనే లక్ష్యంతో పనిచేస్తన్నట్లు వారు పేర్కొన్నారు. 

సెంట్రల్ బుక్స్ సంస్థ ఎడ్యుబ్రిక్స్ నాలెడ్జ్ సొల్యూషన్స్‌తో భాగస్వామిగా ఆంధ్ర‌ప్ర‌‌దేశ్, తెలంగాణలో సెంట్రల్ డిజిటల్ లెర్నింగ్‌ను ప్రారంభించనుంది. డిజిట‌ల్ విభాగంలో పేరుగాంచిన ఎడ్యుబ్రిక్స్ తో క‌లిసి కె -12 విభాగంలో సెంట్ర‌ల్ బుక్స్ సంస్థ ఈ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని కుదుర్చుకున్నారు. క‌రోనా నేప‌థ్యంలో విద్యార్థుల‌కు ఆన్‌లైన్ పాఠాల‌ను అందిచేందుకు, సుల‌భ‌త‌ర‌మైన అభ్యాసానికి అనుగుణంగా ఈ సెంట్ర‌ల్ డిజిట‌ల్ లెర్నింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్ప‌టికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెంట్ర‌ల్ బుక్స్ అందిస్తున్న సేవ‌ల నేప‌థ్యంలో ఈ భాగ‌స్వామ్యం ద్వారా ఆయా పాఠ‌శాల‌ల‌కు మ‌రింత లాభం చేకూర‌నుంది. 

ఎడ్యుబ్రిక్స్ సీఈవో సైజు అర‌వింద్‌ మాట్లాడుతూ.. బోధన, అభ్యాసానికి శాస్త్రీయ విధానం ద్వారా నాణ్యమైన, అంద‌రికి అందుబాటులో ఉండే విద్యను అందిచాల‌నే ల‌క్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈ నేప‌థ్యంలోనే సెంట్రల్ బుక్స్ భాగస్వామిగా కావడం చాలా ఆనందంగా ఉంది. దేశంలోని 1,000కి పైగా విద్యా సంస్థలకు విద్యలో స్థిరమైన, నాణ్యమైన సేవలను సెంట్ర‌ల్ బుక్స్ అందిస్తుంది. శక్తివంతమైన, సాంకేతిక పరిజ్ఞానంతో కలిపి ఇప్పుడు విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తుందని సీఈఓ ఎడుబ్రిస్క్ సైజు అరవింద్ చెప్పారు. సెంట్రల్‌ బుక్స్‌ సీఈవో మిస్టర్ సుధీర్ ముంగాలా మాట్లాడుతూ.. విద్య‌తో అనుబంధం ఉన్న వాటాదారుల అవసరాన్ని తీర్చడానికి మాత్రమే కాకుండా, ముఖ్యంగా ఈ క‌రోనా కష్ట సమయాల్లో విద్యార్థులు తమ అభ్యాసాన్ని తేలిక‌గా కొనసాగించడానికి వీలు కల్పించడం త‌మ ల‌క్ష్య‌మ‌ని సుధీర్ ముంగాలా చెప్పారు.

మరిన్ని వార్తలు