31 వరకు ‘ఎమ్మెల్సీ’ ఓటర్ల నమోదు

6 Jan, 2019 01:10 IST|Sakshi

ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరగనున్న రెండు ఉపాధ్యాయ, ఓ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి ఓటరుగా నమోదయ్యేందుకు ఈ నెల 31 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశాన్ని కల్పించింది. మెదక్, నిజామాబా ద్, ఆదిలాబాద్, కరీంనగర్‌ పట్టభద్రులు/ ఉపాధ్యాయుల నియోజకవర్గాలతో పాటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయుల మండలి నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను ఈ నెల 1న ప్రకటించారు. ముసాయిదా ఓటర్ల జాబి తాపై అభ్యంతరాలతో పాటు కొత్తగా ఓటర్ల నమోదుకు దరఖాస్తుల సమర్పణకు జనవరి 31 వర కు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

2018 నవంబర్‌ 1 అర్హత తేదీగా ఓటర్ల నమోదుకు దరఖా స్తులు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 15కి ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలించి అనుబంధ ఓటర్ల జాబితాలను, 20న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో 41 కొత్త పోలింగ్‌ కేంద్రాలను.. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌ ఉపాధ్యాయుల నియోజకవర్గం/ వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 59 కొత్త పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు

మరిన్ని వార్తలు