ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై దృష్టి పెట్టాలి

12 Sep, 2018 17:02 IST|Sakshi
కేంద్ర ఎన్నికల సంఘం భేటీకి హాజరైన ఉన్నతాధికారులు

సాక్షి, హైదరాబాద్‌ : ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై దృష్టి పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం బృందం ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించింది. బుధవారం జలమండలిలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం 31 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలతో నిర్వహించిన సమావేశం ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. సమావేశంలో ప్రధానంగా ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాపై చర్చ జరిగింది. సమస్యాత్మకమయిన ప్రాంతాలు, శాంతి భద్రతలపై ఎస్పీలతో సుధీర్ఘంగా ఈసీ చర్చలు జరిపింది.

వివి పాట్స్‌లు, ఈవీఎంలపై ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఈసీ సూచించింది.  ఈవీఎంల భద్రత, స్టోరోజీ, రవాణాకు కావాల్సిన ఏర్పాట్లపై దృష్టి సారించాలని కోరింది. జలమండలిలో సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం బృందం సచివాలయానికి బయలుదేరింది.

మరిన్ని వార్తలు