కరోనా : కేంద్ర బలగాలు రావట్లేదు

28 Mar, 2020 10:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణకు కేంద్ర బలగాలు వస్తున్నాయన్న వార్తలను తెలంగాణ డీజీపీ కార్యాలయం కొట్టిపరేసింది. ఆ వార్తలు అవాస్తవమని తెలిపింది. తెలంగాణకు కేంద్ర బలగాలు కావాలని కోరలేదని, ఆ అవసరం కూడా లేదని స్పష్టం చేసినట్లు పేర్కొంది. కాగా, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా నేపథ్యంలో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. దోమలగూడ, బౌద్ధనగర్, సికింద్రాబాద్‌, చందానగర్, కోకాపేట, మణికొండ ప్రాంతాల్లో ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారు. ( ‘కరోనా’ వెబ్‌సైట్లు ఓపెన్‌ చేయొద్దండి ) ఆశావర్కర్లు, ఏఎన్‌ఎమ్‌లు అనారోగ్యంతో ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజే 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య 59కి చేరింది. గడిచిన వారం రోజుల్లోనే 40 కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం. (కరోనా నియంత్రణ ఏర్పాట్లలో ముందున్నాం )

మరిన్ని వార్తలు