ఆ జిల్లాలు జాగ్రత్త! 

6 Apr, 2020 02:35 IST|Sakshi

పరిస్థితి చేయి దాటితే అదుపు చేయడం కష్టం 

అవసరమైతే లాక్‌ డౌన్‌ వేళలు పొడిగించండి 

మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారిని గుర్తించి వైద్య పరీక్షలు చేయండి 

రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్‌ దేశవ్యాప్తంగా 96 ‘రెడ్‌’ జిల్లాల ప్రకటన 

తెలంగాణలో రెడ్‌ జిల్లాలుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ 

ఏపీలో విశాఖపట్నం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి విరుచుకుపడుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ జిల్లాల్లో మరిన్ని కేసులు నమోదు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవా లని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ఢిల్లీ మర్కజ్‌ మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన తర్వాతే పాజిటివ్‌ కేసుల సంఖ్య అమాం తం పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారికి తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించాలని, వారి కుటుంబ సభ్యులను, కలసిన వారందరినీ క్వారంటైన్‌ చేయాలని ఆదేశించింది. కేసుల సంఖ్యకు అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని అంచనా వేసిన కేంద్రం.. దేశవ్యాప్తంగా అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన 96 జిల్లాలను రెడ్‌ జిల్లాలుగా ప్రకటించింది.

ఈ జిల్లాల పరిధిలోని హాట్‌స్పాట్‌లను గుర్తించి.. అక్కడ కరోనా వైరస్‌ ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ రెడ్‌ జిల్లాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 10 జిల్లాలున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలు, ఏపీలో విశాఖపట్నం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూ రు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలున్నాయి. వీటి పరిధిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఆది వారం వీడియో కాన్ఫరెన్స్‌లో సైతం కేబినెట్‌ సెక్రటరీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కరోనా తీవ్రరూపం దాల్చితే కట్టడి చేయడం కష్టమని, లాక్‌డౌన్‌ కఠినంగా అమలు జరిగేలా చూడాలని, అవసరమైతే ఆంక్షలను మరికొన్ని గంటలు పొడిగించాలని సూచించారు.  

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు ఇవే..
ఉత్తర, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్‌ (అండమాన్‌ , నికోబార్‌ దీవులు), విశాఖపట్నం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు (ఆంధ్రప్రదేశ్‌), పట్నా, ముంగేర్, బేగుసరాయ్, లక్కిసరాయ్, నలందా(బిహార్‌), చండీగఢ్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, దుర్గ్‌ (ఛత్తీస్‌గఢ్‌), సౌత్, సౌత్‌వెస్ట్, ఈస్ట్, వెస్ట్, నార్త్‌వెస్ట్, నార్త్‌ ఈస్ట్, నార్త్, నార్త్‌ ఢిల్లీ, సెంట్రల్, సహదరా, సౌత్‌ ఈస్ట్‌ (ఢిల్లీ), దక్షిణ గోవా, ఉత్తర గోవా(గోవా), అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోద, రాజ్‌కోట్, భావ్‌నగర్, బోతాడ్, గిర్‌ సోమ్‌నాథ్, కఛ్, మహేసన, పోర్‌బందర్‌ (గుజరాత్‌), గుర్గావ్, ఫరీదాబాద్, అంబాలా (హరియాణా), శ్రీనగర్, బాందిపొర (జమ్ము, కశ్మీర్‌), బెంగళూరు అర్బన్, చిక్‌బళ్లాపూర్, ఉత్తర కన్నడ, మైసూరు(కర్ణాటక), కసర్‌గఢ్, ఎర్నాకులం, కన్నూర్, పాత్తనమిట్ట, కోజికోడ్, మల్లాప్పురం, తిరువనంతపురం (కేరళ), లేహ్‌ లఢక్‌ (లఢక్‌), ఇండోర్, జబల్‌పూర్, ఉజ్జయిని, భోపాల్‌ (మధ్యప్రదేశ్, ముంబై, పుణే, నాగ్‌పూర్, సాంగ్లీ, థానే, అహ్మద్‌నగర్, పాలఘర్‌ (మహారాష్ట్ర), షాహిది భగత్‌సింగ్‌ నగర్, ఎస్‌ఏఎస్‌ నగర్, బిల్వారా (పంజాబ్‌), జైపూర్, జోధ్‌పూర్, ఝంఝూ (రాజస్తాన్‌), చెన్నై, తిరునల్వేలి, ఈరోడ్, నమక్కల్, కోయంబత్తూర్, కన్యాకుమారి (తమిళనాడు), హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి (తెలంగాణ), మీరట్, ఆగ్రా, గౌతం బుద్ధనగర్, లక్నో, గజియాబాద్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), డెహ్రాడూన్‌ (ఉత్తరాఖండ్‌), కోల్‌కతా, 24 పరగణాల ఉత్తర, హూగ్లీ, మిడ్నాపూర్‌ ఈస్ట్, నడియా(పశ్చిమబెంగాల్‌)   

మరిన్ని వార్తలు