గ్రామీణాభివృద్ధికి పెద్దపీట

11 Apr, 2019 09:45 IST|Sakshi
నారాయణపేటకు వేసిన బీటీ రోడ్డు

సాక్షి, మరికల్‌: ‘‘ఊరికి మరిన్ని మెరుపులు మెరిపించాలనే ఉద్దేశంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా అడుగలు వేసింది. ఉపాధి హామీకి మరింత ధీమాను ఇచ్చి.. మారుమూల పల్లెల్లో కూడా అందరికీ విద్యుత్‌ సౌకర్యం.. గ్రామీణ రోడ్లకు మెరుగులు దిద్దేందుకు నిధులు  విడుదల.. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇళ్లు.. స్వచ్ఛభారత్‌ లక్ష్యానికి అందుకోవడం కోసం ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయడంతోపాటు ప్రతి గ్రామంలో కనీస మౌలిక వసతుల కల్పనకు కేంద్రం పెద్దపీట వేయడంతో గ్రామీణ రంగస్థలం ముస్తాబువుతుంది.’’ 

గ్రామీణ ఉపాధి హామీ పథకం 
గ్రామాల్లో ఏ ఒక్కరూ ఆకలితో ఉండరాదనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మరింత ఊతమిచ్చింది. ఆ దిశగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలకు గిట్టుబాటు కూలీ కల్పించడంలో ఉపాధి పనులు చేయాడానికి కూలీలు ఉత్సాహం చూపుతున్నారు. 

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామ్‌జ్యోతి యోజన 
మారుమూల గ్రామాల్లో కూడా విద్యుత్‌ కాంతులను నింపేందుకు రూ.125కే విద్యుత్‌ మీటర్‌ను ఏర్పాటు చేసి గిరిజనుల కుటుంబాల్లో వెలుగు జ్యోతిని నింపేందుకు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామ్‌జ్యోతి యోజన పథకం అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. 

ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన 
రహదారులు లేని అవాసాలకు కూడా ప్రధాన మంత్రి గ్రామ్‌సడక్‌ యోజన పథకం బీటీరోడ్లను వేయించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకం ద్వారా గిరిజన ప్రాంతాలకు నాణ్యమైన రోడ్లు వస్తాయానే భరోసా వచ్చింది. 

గ్రామీణ తాగునీటి పథకం 
తాగునీటి వనరులు లేని అనేక మారుమూల గ్రామాల్లో, ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద అక్కడి ప్రజలకు సురక్షితమైన, తాగునీటిని అందించాలనేది ఈ పథకం ప్రధాన ఉద్ధేశం. 

గ్రామీణ టెలిఫోనీ 
మారుమూల పంచాయతీలో కూడా వైపై హాట్‌స్పాట్స్, ఇన్‌స్టలేషన్, హైస్ఫీడ్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ కనెక్టివిటీ వంటి సౌకర్యాలను అందించడమే గ్రామీణ టెలిఫోనీ పథకం లక్ష్యం. 

స్వచ్ఛ్‌భారత్‌ 
బహిరంగ మలవిసర్జన చేయరాదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ పథకం అమలు చేసింది. ఈ పథకం ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత కోసం ఇంటింటికి మరుగుదొడ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామంలో వందశాతం మరుగుదొడ్లను నిర్మించడమే ఈ పథకం లక్ష్యం. 

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లులేని పేదలకు గ్రామీణ ఆవాస్‌ యోజన పథకం కింద ఇళ్లు నిర్మించి ఇవ్వడం కోసం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం అమల్లోకి వచ్చింది. 

మరిన్ని వార్తలు