జోగుళాంబ ఆలయానికి కేంద్ర ప్రసాదం

6 Aug, 2018 20:40 IST|Sakshi

అభివృద్ధి పథకంలో చేర్చాలని కోరిన ఎంపీ జితేందర్‌రెడ్డి 

సానుకూలంగా స్పందించిన కేంద్ర పర్యాటక సహాయ మంత్రి అల్ఫోన్‌

లిఖితపూర్వకంగా ప్రతిపాదనలు పంపించాలని సూచన

తాజాగా ఆలయాలను పరిశీలించిన ఓ బృందం

సాక్షి, జోగుళాంబ శక్తిపీఠం : తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠమైన అలంపూర్‌ జోగుళాంబ ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఈ మేరకు పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడంపై అలంపుర్‌ ప్రాంత వాసి, మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉన్న ఏపీ జితేందర్‌రెడ్డి దృష్టి సారించారు. పార్ల మెంట్‌ సమావేశాల్లో భాగంగా ఇటీవల ప్రశ్నోత్తరాల సమయంలో అలంపూర్‌ జోగుళాంబ ఆలయ ప్రస్తావనను ఎంపీ తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రసాద్, హృదయ్‌ల్లో అలంపూర్‌ జోగుళాంబ ఆలయానికి స్థానం కల్పించాలని కేంద్రాన్ని కోరగా కేంద్ర పర్యాటక సహాయ శాఖ మంత్రి అల్ఫోన్‌ కన్న న్‌ంథనమ్‌ లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేస్తే పరిశీలిస్తామని వెల్లడించారు. దీంతో ఎంపీ జితేందర్‌రెడ్డి.. క్షేత్ర ప్రాశస్త్యం వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి నివేదించేందుకు సంసిద్ధులయ్యారు. కాగా, 2020లో తెలంగాణ వ్యా ప్తంగా అలంపూర్‌లో మాత్రం తుంగభద్ర పుష్కరాలు జరగనుండగా.. ఆలోగా ప్రసాద్, హృదయ్‌ పథకాల్లో ఆలయం చేరితే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. 

ఏమిటీ పథకాలు ?
పురాతన వారసత్వ సంపద కలిగి పర్యాటకం గా ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం 2014–2015 ఆర్థిక సంవత్సరంలో ప్రసాద్, హృదయ్‌ పథకాలు ప్రవేశపెట్టింది. ఈ రెండు పథకాల కో సం ఏటా రూ.500కోట్లను బడ్జెట్‌లో కేటాయిస్తుంది. ఏదేని ఒక యాత్ర స్థలం లేదా యాత్రా స్థ లం కలిగిన పట్టణాన్ని కానీ ఆధునికీకరించి అభివృద్ధి చేసేందుకు ఈ పథకాలు ఉపయోగ పడతాయి. ఇందులో ప్రధానంగా ‘ప్రసాద్‌’ పథకం ద్వారా మతపరమైన వారసత్వ కేం ద్రాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. నేషన ల్‌ మిషన్‌ ఆఫ్‌ ఫిలిగ్రిమేజ్‌ రిజివనేషన్‌ అండ్‌ స్ప్రిచ్యువల్‌ అగ్మెంటేషన్‌ డ్రైవ్‌(ప్రసాద్‌) కింద ఇప్పటికే 10 రాష్ట్రాల్లో 13 పర్యాటక క్షేత్రాలు ఎంపిక చేశారు.

ఇందులో అమరావతి(ఏపీ), గయ, పాట్నా(బీహార్‌), ద్వారక(గుజరాత్‌), అమృత్‌సర్‌(పంజాబ్‌) అజ్మీర్‌(రాజస్థాన్‌) కాంచీపురం, వేలంగి(తమిళనాడు), పూరీ(ఒడిసా), వారణాసి, మరియు మధుర(యూపీ), కేదారినాథ్‌(ఉత్తరఖాండ్‌) కామాఖ్య(అస్సాం) ఉన్నాయి. ఇక హెరిటేజ్‌ సిటి డెవలప్‌మెంట్‌ అండ్‌ అగ్మెంటేషన్‌ యోజన(హృదయ్‌) ద్వారా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తారు. ఈ పథకం వర్తించడానికి వారసత్వ సంపద, సాంస్కృతిక, చారిత్రక నేపథ్యాలను ఆదారంగా తీసుకుంటారు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.15.60 కోట్లను ఈ పథకం అమలుకు మంజూరు చేశారు. వివిధ రాష్ట్రాల నునండి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా కేంద్ర పర్యాటక శాఖ – కేంద్ర పట్టణాభివృద్ది శాఖల మంత్రి అధ్యక్షతన జాతీయ కమిటీ ఎంపిక చేస్తుంది. 

అలంపూర్‌.. రెండింటికీ అర్హత 
కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్, హృదయ్‌ రెండింటి కింద అభివృద్ధి చేసేందుకు అలంపూర్‌ క్షేత్రానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కాడా లేని విధంగా నవబ్రహ్మ ఆలయాలు కలిగి ఉండటం, అష్టాదశ శక్తి పీఠాల్లో అయిదో శక్తిపీఠం కావడం, 1400 ఏళ్ల చరిత్ర కలిగిన పట్టణం కావడం, శ్రీౖశైల ముంపు నుంచి పీఠాధిపతులు, చారిత్రక పరిశోధకుల సూచన మేరకు కాపాడబడిన క్షేత్రంగా ప్రఖ్యాతి గాంచినా ఎవరు కూడా కేంద్రపథకాలపై దృష్టి సారించలేదు. అలంపూర్‌ నియోజకవర్గ వాసి అయిన పాలమూరు ఎంపీ జితేందర్‌రెడ్డి లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో అలంపూర్‌ ఆలయాల ప్రస్తావన తీసుకురావడం విశేషం. 

తొలి అడుగు 
జోగుళాంబ శక్తిపీఠం అభివృద్ధి చెందేలా ‘ప్రసాద్‌’ పథకంలో చేర్చాలని ఓ పక్క ఎంపీ జితేందర్‌రెడ్డి యత్నిస్తుండగా.. కేంద్రప్రభుత్వం సైతం అడుగులు వేస్తోందని సమాచారం. ఈ మేరకు ఆలయాల పూర్తి వివరాలు సేకరించేందుకు పర్యాటక శాఖకు చెందిన ఉద్యోగులు ముగ్గురితో కూడిన బృందం శనివారం పర్యటించింది. ఈ సందర్భంగా ఆలయాలు, విశిష్టత, పరిస ప్రాంతాలను వారు పరిశీలించి ఉద్యోగులను వివరాలు ఆరా తీశారు. 

గతంలోనే ఎంపీ దృష్టికి... 
అలంపూర్‌ క్షేత్రం అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరుతూ ఆలయ ఈఓ గురురాజతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు పలువురు టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌గా ఎంపికైన సమయంలోనే జితేందర్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి విన్నవించారు. అనంతరం పలు సందర్భాల్లో జితేందర్‌రెడ్డిదీ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఈ ఆలయాలు కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉండడంతో ఎలాంటి అభివృద్ధి, నిర్మాణ పనులు చేపట్టేందుకైనా ఆ శాఖ నుంచి అభ్యంతరాలు రావొద్దంటే కేంద్రప్రభుత్వ పథకాల్లో చేర్పించడమే మార్గమని భావించిన ఎంపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 

పూర్తి నివేదిక తీసుకుంటాం..
అలంపూర్‌ ఆలయాలకు ‘ప్రసాద్‌’ పథకం వర్తించేలా కృషి చేస్తాను. ఆలయ చరిత్రతో పాటు సమగ్ర సమాచారం కోసం స్టేట్‌ డైరెక్టర్‌ విశాలాచ్చితో మాట్లాడి పూర్తి నివేదిక కోరతాను. అలంపూర్‌ ఆలయాలపై కేసీఆర్‌కు ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఇంకా పలువురిని నాయకుల విజ్ఞప్తులతో పాటు  అమ్మవారిపై నాకు ఉన్న భక్తి మేరకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చాను. తప్పక సాధిస్తాననే నమ్మకం ఉంది. – ఏ.పీ.జితేందర్‌రెడ్డి,ఎంపీ, మహబూబ్‌నగర్‌

ఎంపీ ఆకాంక్ష సిద్ధించాలి 
ఎంపీ జితేందర్‌రెడ్డి అలంపూర్‌ ఆలయాల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన ప్రతిపాదన అభినందనీయం. వారి ఆకాంక్ష సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. క్షేత్ర స్థాయిలో ఎలాంటి సమాచార సేకరణ, లేక ఇతర విషయాల్లోనైనా మా తరఫున పూర్తిగా సహకరిస్తాం. – బండి శ్రీనివాస్, జోగుళాంబ సేవసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు 

చాలా సంతోషంగా ఉంది 
అలంపూర్‌ ఆలయాల అబివృద్ధికి కేంద్రప్రభుత్వ సాయం కోరడం చాల సంతోషంగా ఉంది. ఈ ప్రాంత వాసిగా ఎంపీ జితేందర్‌రెడ్డి గతంలో జోగుళాంబ ఆలయ పునఃనిర్మాణానికి కూడా ఎంతో సహకరించారు. ప్రస్తుతం ఈ ఆలయాలు ఈ రెండు పథకాల కింద ఎంపికైతే అభివృద్ధి పరుగులు తీస్తుంది. – గురురాజ, ఈఓ

ఆర్థికంగా ముందంజలో ఉంటుంది 
ప్రసాద్‌–హృదయ్‌ పథకం కింద ఈ ప్రాంతం ఎంపికైతే రాబోయే కాలంలో యువకులు, నిరుద్యో గులకు ఉపాధి మార్గాలు మెరుగవుతాయి. పైగా ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందంజలో నిలుస్తుంది. పైగా రాష్ట్రానికి వన్నె తీసుకొస్తుంది. భారత్‌ దర్శన్‌లో భాగంగా అలంపూర్‌ క్షేత్రం ఎన్నికైతే దక్షిణ తెలంగాణకు గొప్ప ప్రవేశద్వారం అవుతుంది.  – నందు, విద్యావేత్త, అలంపూర్‌  

మరిన్ని వార్తలు