నల్లగొండలో చేనేత అభివృద్ధి కమిషనర్ పర్యటన

13 Jan, 2016 17:16 IST|Sakshi

చౌటుప్పల్: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో 31 చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జాతీయ చేనేత అభివృద్ధి కమిషనర్ అలోక్‌కుమార్ వెల్లడించారు. ఇందుకోసం రూ.2 కోట్ల చొప్పున కేటాయింపులు జరిగాయని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని చేనేత మగ్గాలను పరిశీలించారు. వస్త్రాల తయారీని స్వయంగా చూసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు