విమర్శిస్తే ఊరుకునేది లేదు: దత్తన్న

3 May, 2017 18:43 IST|Sakshi
విమర్శిస్తే ఊరుకునేది లేదు: దత్తన్న

హైదరాబాద్‌: మిర్చి రైతుల ఇబ్బందులు తీర్చలేక కేంద్రాన్ని విమర్శిస్తే ఊరుకోబోమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. పత్తి వద్దు మిర్చి ముద్దు అని స్వయంగా సీఎం కేసీఆరే ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు. ఆయన ప్రచారం కారణంగా మిర్చి సాగు పెరిగి దిగుబడి ఎక్కువ వచ్చిందని అన్నారు. మిర్చి కొనుగోలు కేంద్రాలు ప్లాన్ చేయక పోవడం వల్ల రైతులు వ్యాపారుల చేతుల్లో నలిగి పోయారని ధర దక్కక మిర్చిని తగుల బెడుతున్నారని మంత్రి తెలిపారు.

అందుకు కేంద్ర ప్రభుత్వమే కారణమని నిందిస్తే ఊరుకునేది లేదన్నారు. వాణిజ్య పంటల ధరలతో కేంద్రానికి సంబంధం ఉండదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేసిన మొదటి నివేదికలో స్పష్టత లేదు..ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని విమర్శించారు. ప్రభుత్వం తమ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సరి కాదని తెలిపారు. ఇంతగా గొడవలు జరుగుతున్నా రాష్ట్ర సర్కారు ఎవరిపై అయినా చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు. అయినా మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్ కింద మిర్చి పంటను కొనాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని వివరించారు.

మరిన్ని వార్తలు