కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

11 Aug, 2018 11:36 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఏడీ హరిబాబు 

కేంద్ర సమాచార, ప్రచార మంత్రిత్వశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హరిబాబు

తిర్యాణి(ఆసిఫాబాద్‌) : కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని జీవణ ప్రమాణాలు పెంపొందించుకోవాలని కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రచారశాఖ మంత్రిత్వశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హరిబాబు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేంద్రం పేదల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకాలతో ప్రజలు లబ్ధిపొందాలన్నారు.

ప్రజలకు పథకాలు ఎలా ఉపయోగపడుతున్నాయో మరింత అవగాహన కల్పించడానికి ప్రచార మంత్రిత్వశాఖ క్షేత్ర ప్రచార విభాగం ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష యోజన, జీవన జ్యోతి బీమాయోజన, అటల్‌ పెన్షన్‌ యోజన, స్వచ్ఛభారత్‌ అభియాన్, బేటీ పడావో, బేటీ బచావో, ముద్రయోజన, కౌషల్‌ యోజన, పంటల బీమా యోజన, ఆయుష్మాన్‌భవ యోజన, ఉజ్వల యోజన పథకాలపై అవగాహన కల్పించారు.

అంతకు ముందు ప్రజాప్రతినిధులు స్వచ్ఛభారత్‌ నిర్వహించారు. రోడ్లు శుభ్రం చేశారు. సమావేశంలో ఎంపీపీ హన్మాండ్ల లక్ష్మి, సీడీపీవో సావిత్రి, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంఈవో శంకర్, టీఆర్‌ఎస్‌ నాయకులు పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు. చింతలమానెపల్లి(సిర్పూర్‌): కేంద్ర ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ అశోక్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని రుద్రపూర్‌ గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్‌లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా నోడల్‌ అధికారి సుదర్శన్‌ రెడ్డి, డీఎల్‌ఎం రామయ్య, డీపీవో గంగాధర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు