రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వాలు

1 May, 2015 01:03 IST|Sakshi

- తడిసిన ధాన్యాన్ని కోనుగోలు చేయాలి
- మే 2న వీహెచ్ రాహుల్ రైతు సందేశ్ యాత్ర
- డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం
కరీంనగర్ :
  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేల ముంచుతున్నాయని డీసీసీ అధ్యక్షులు కటుకం మృత్యుంజయం ఆరోపించారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వడగండ్ల వానలకు నష్టపోయిన రైతులను ఆదుకోకపోవడంలో పాలకులు నిర్లక్ష్యం వీడాలన్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం పంటనష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించకపోవడం సిగ్గుచేటన్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ, బహిరంగ సభల మోజులో పడి రైతు సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు.

మల్లాపూర్ చక్కెర కర్మాగారం పరిధిలోని చెరకు రైతులకు వెంటనే బకారుులు చెల్లించాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కోనుగోలు చేయలేమని మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడడం బాధ్యతా రాహిత్యమన్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయూలన్నారు.

రైతులకు వెంటనే పరిహారం ఇవ్వకుంటే మే మొదటి వారంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. రైతులకు జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాజ్యసభ ఎంపీ వి.హన్మంతరావు మే 2న జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. ఉదయం 9.30 గంటలకు గంభీరావుపేట నుంచి బయలుదేరి దమ్మన్నపేట, బొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట, పదిర, వెంకటాపూర్, సిరిసిల్ల, నాంపెల్లి, కొదురుపాక , బావుపేటలో పంటలను పరిశీలిస్తూ జిల్లా కేంద్రానికి చేరుకుంటారని చెప్పారు.

మరిన్ని వార్తలు