కరోనా వైరస్‌: హైదరాబాద్‌కు కేంద్ర వైద్యుల బృందం

28 Jan, 2020 13:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని ఫీవర్‌ ఆసుపత్రికి కేంద్ర వైద్యుల బృందం మంగళవారం చేరుకున్నారు. ఆసుపత్రిలోని ఐసోలేటేడ్‌ వార్డులను, కరోనా వైరస్‌ అనుమానితుల చికిత్స వార్డులను కేంద్ర వైద్యుల బృందం పరిశీలించనున్నారు. కాగా తెలంగాణలో కరోనా వైరస్ ఉన్నట్టు ఇంకా ఎలాంటి నిర్దారణ కాలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని విషయాలు మానిటర్ చేస్తుందన్నారు. రేపు(బుధవారం) కరోనా వైరస్‌పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని. కేంద్ర బృందం కూడా ప్రస్తుతం నగగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్యటిస్తుందని పేర్కొన్నారు.(80కి చేరిన కరోనా మృతుల సంఖ్య)

సచివాలయం : కరోనా వైరస్‌పై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కడా నమోదు కాలేదని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించాలని తెలిపారు. 
చదవండి :కరోనా కలవరం.. చైనా నుంచి రాయచోటి విద్యార్థిని

ఈ సందర్భంగా ఫీవర్‌ ఆసుపత్రి సూపరింటెండ్‌ శంకర్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాకు సంబంధించి ఎలాంటికేసుకు నమోదు కాలేదని తెలిపారు. అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి పుణెకు పరిక్షలకోసం పంపిస్తే నెగటివ్‌గా తేలిందని అన్నారు.  ఈ రోజు మూడు కేంద్రప్రత్యేక వైద్య బృందాలు ఫీవర్ హాస్పిటల్ సందర్శించనున్నారని, చైనా నుంచి వచ్చిన ఇద్దరు అనుమానితులను ఫీవర్ ఆసుపత్రిలో పరిక్షించనున్నారని పేర్కొన్నారు. కరోనా వైరస్ సంబంధించి తగు సూచనలు సలహాలు ఇవ్వనున్నట్లు, ఫీవర్ హాస్పిటల్ లో 40 పడకలతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్నఆసుపత్రి డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. 

మరిన్ని వార్తలు