సెస్‌’ అధ్యయనం వాయిదా: తలసాని

7 Feb, 2018 02:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గొర్రెల పంపిణీ పథకంపై ఏర్పాటు చేసిన ఆర్థిక, సామాజిక అధ్యయనాల కేంద్రం (సెస్‌) అధ్యయనాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

ఈ పథకం ద్వారా గొల్ల, కురుమలకు కలిగిన ఆర్థికలాభం, పెరిగిన మాంసం ఉత్పత్తిని అంచనా వేసేందుకు సెస్‌ ద్వారా అధ్యయనం చేయించాలని తొలుత భావించామని, అయితే అందుకు కనీసం ఏడాదైనా వేచి చూడాల్సి ఉన్నందున వాయిదా నిర్ణయం తీసుకున్నామన్నారు. గొర్రెల రీసైక్లింగ్‌ను నిరోధించేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌లతో పాటు ప్రతి జిల్లాలో రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్‌పోర్ట్, పశుసంవర్థక శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. గొర్రెలు కొనుగోలు చేస్తున్న దళారులపై 85 కేసులు నమోదు చేశామన్నారు.  

>
మరిన్ని వార్తలు