రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్న కేసీఆర్

13 Feb, 2016 04:29 IST|Sakshi
రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్న కేసీఆర్

టవర్‌సర్కిల్ : ముఖ్యమంత్రి కేసీఆర్  నీచ, నికృష్ట వ్యవహారాలతో రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని టీఆర్‌ఎస్‌లో తెలుగుదేశం పార్టీ శాసనభ్యుల చేరికలే ఇందుకు పరాకాష్ట అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.విజయరమణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. టీడీపీని బలహీన పరిచేందుకు కేసీఆర్ వలసలు ప్రోత్సహిస్తున్నారన్నారు. 15 నెలలుగా ఎర్రబెల్లి టీడీపీకి సంబంధించిన కీలక సమాచారాన్ని కేసీఆర్‌కు చేరవేస్తున్నారని అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడడానికి ఎర్రబెల్లే కారణమని ఆరోపించారు.  అర్ధరాత్రి రహస్యంగా కేసీఆర్ వద్దకు వెళ్లి మంతనాలు జరిపినప్పుడే సస్పెండ్ చేస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో టీడీపీ లేకుండా చేయడం కేసీఆర్‌కు సాధ్యం కాదన్నారు. గంట రాములు, రొడ్డ శ్రీనివాస్, చెల్లోజి రాజు, కళ్యాడపు ఆగయ్య, పుట్ట నరేందర్, సత్తు మల్లేశం, గాజె రమేశ్, జాడి బాల్‌రెడ్డి, దూలం రాధిక, నూజెట్టి వాణి, ఆడెపు కమలాకర్, సందబోయిన రాజేశం, నిజామొద్దీన్, విజయ్‌కుమార్, లక్ష్మణ్, సలీం పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా