పేదలను విస్మరించిన కేసీఆర్

29 Jul, 2015 22:11 IST|Sakshi

హన్మకొండ చౌరస్తా: సీఎం కేసీఆర్ పేదలను విస్మరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. బుధవారం వరంగల్ జిల్లా హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 14 నెలల పాలనలో పేదలకు ఒక్క ఇల్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ధనవంతులు, బడా పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తున్న సీఎం.. ఏళ్లకు ఏళ్లుగా గుడిసెల్లో మగ్గుతున్న పేదలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.

పేదల ఇళ్ల కూల్చివేతలపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. వరంగల్ నగరంలో 24 వేల మంది పేదలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. తెలంగాణలో ఆక్రమణలకు గురైన భూముల లెక్కలు వెలికితీసి.. భూపోరాటాలు చేపడుతామని హెచ్చరించారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పది వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించుతామని తెలిపారు.

మరిన్ని వార్తలు