నల్లమల అగ్నిగుండంగా మారుతుంది: చాడ

6 Sep, 2019 15:14 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : యురేనియం తవ్వకాలకు అనుమతినిస్తే నల్లమల అగ్నిగుండంగా మారుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌ రెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర స్థాయి విద్యా  వైజ్ఞానిక సైద్ధాంతిక రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌ రెడ్డి  హాజరైయ్యారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యురరేనియం తవ్వకాలను ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చి అన్నిదేశాలు వెనక్కి తగ్గుతుంటే మన దేశంలో ఇలాంటి  మైనింగ్‌కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  ముందుకు రావడం దారుణమని వ్యాఖ్యనించారు.

నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిపితే రెండు రాష్ట్రాల్లోని ఏడు జిల్లాల్లో తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. 2003లో ఇలాంటి తవ్వకాలు జరిపితే  అసెంబ్లీలో తామంతా వ్యతిరేకించామని గుర్తు చేశారు. అయితే తాజాగా మళ్లీ ఆ ప్రాంతంలోని ప్రజలు యురేనియం ప్రభావంపై నిరసనలకు దిగడంతో సీఎం జగన్ వాటిపై అధ్యయన కమిటీ వేశారని తెలిపారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు