జర్నలిస్టులను మోసగిస్తున్న కేసీఆర్‌

18 Mar, 2017 03:20 IST|Sakshi
జర్నలిస్టులను మోసగిస్తున్న కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇళ్లస్థలాలు ఇస్తామని చెప్పి జర్న లిస్టులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మోసగి స్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2017 మార్చి నాటికి జర్నలిస్టులకు అద్భుతంగా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు.  మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా జర్నలిస్టు భవన్‌ను నిర్మిం చాలని, అక్రిడిటేషన్లకు సంబంధించి సీనియర్‌ సంపాదకుడు కె.రామచంద్రమూర్తి ఇచ్చిన నివేదికను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు