రోడ్డుపై సిగరెట్‌ తాగినందుకు జరిమానా

27 Sep, 2018 09:30 IST|Sakshi
రోడ్డుపై సిగరెట్‌ తాగుతున్న వారికి చలానా విధిస్తున్న అధికారులు

పంజగుట్ట: పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పలుప్రాంతాల్లో రోడ్లపై సిగరెట్‌ తాగుతున్న, గుట్కాలు నములుతున్న, విక్రయిస్తున్న 22 మంది వ్యక్తులకు అధికారులు జరిమానా విధించారు. తెలంగాణ టోబాకో టెక్నికల్‌ ఆఫీసర్‌ ఎస్‌.నాగరాజు, మాస్‌ మీడియా ఆఫీసర్‌ జే.రాములు, డాక్టర్‌ అనూషాలతో పాటు కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అఫైర్స్‌ డిప్యుటీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాణా, టెక్నికల్‌ డైరెక్టర్‌ గోవింద్‌ త్రిపాఠి బుధవారం పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాన్‌షాప్‌లు, బార్లు, రోడ్లపై  బహిరంగంగా సిగరెట్‌ తాగుతున్న వారిని గుర్తించి జరిమానా విధించారు.

22 కేసులు నమోదు చేయగా వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. పాఠశాలకు 100 గజాల దూరం వరకు పాన్‌షాప్‌ ఉండరాదని నిబంధనలు అతిక్రమిస్తే చర్య లు తప్పవన్నారు. బార్‌లలో ఆల్కహాల్‌ తాగేందు కు మాత్రమే అనుమతి ఉందని, సిగరెట్‌ నిషేధమన్నారు. పలు బార్‌లలో తనిఖీలు చేసి నో స్మోకింగ్‌ బోర్డులు లేకపోవడం, సిగరెట్‌ తాగినట్లు ఆనవా లు కనిపించడంతో బార్‌ నిర్వాహకులకు కూడా ఫైన్‌ వేశారు. తెలంగాణలో నికోలిన్‌ నిషేధం విధించినా పలు  పాన్‌షాప్‌లలో పాన్‌మసాలా, నికోలిన్‌ వేర్వురుగా విక్రయిస్తున్నట్లు గుర్తించి వారికి జరిమానా విధించడమేగాక  కేసులు నమోదు చేశామన్నారు. ఆరుగురు గుట్కా తినేవారిని గుర్తించగా అందులో ఐదుగురు వ్యక్తులకు క్యాన్సర్‌ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించామన్నారు. ముగ్గురు మూడో స్టేజ్‌లో, ఇద్దరు రెండవ స్టేజ్‌లో ఉన్నట్లు తెలిపారు. వారికి కౌన్సెలింగ్‌ ఇస్తామన్నారు. చైన్‌ స్మొకర్లు, గుట్కాలు తినేవారిని టొబాకో స్ట్రేష్టేషన్‌ సెంటర్‌లో చేర్చుకుని వాటిని మానుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గోడపై గుడి చరిత్ర!

చెత్త‘శుద్ధి’లో భేష్‌ 

కృష్ణమ్మ వస్తోంది!

అంత డబ్బు మా దగ్గర్లేదు

లాభం లేకున్నా... నష్టాన్ని భరించలేం!

ఓయూ నుంచి హస్తినకు..

మాదాపూర్‌లో కారు బోల్తా 

20వ తేదీ రాత్రి ఏం జరిగింది?

నిజాయతీ, నిస్వార్థ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది

బేగంపేటలో వింగర్‌ బీభత్సం 

ఆ పుస్తకం.. ఆయన ఆలోచన 

హైదరాబాద్‌ యూటీ కాకుండా అడ్డుకుంది జైపాలే 

ఓ ప్రజాస్వామ్యవాది అలుపెరుగని ప్రస్థానం 

అత్యంత విషమంగా ముఖేష్‌ గౌడ్‌ ఆరోగ్యం.. 

ఈనాటి ముఖ్యాంశాలు

జైపాల్‌ రెడ్డి సతీమణికి సోనియా లేఖ

బోనమెత్తిన రాములమ్మ, సింధు, పూనమ్‌

‘న్యాయం కోసం వచ్చేవారికి బాసటగా నిలవాలి’

కంటతడి పెట్టిన కర్ణాటక స్పీకర్‌

జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి

వికారాబాద్‌లో గుప్తనిధుల కలకలం

‘జైపాల్‌, నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం’

ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు

చెట్టెక్కింది..పక్షి పిల్లలను మింగేసింది

టీపీసీసీ చీఫ్‌ రేసులో ఆ ఇద్దరు..!

'నాన్న ఇచ్చిన ఆ డబ్బు నా జీవితాన్ని మార్చింది'

సోనీ కిడ్నాప్‌ కేసులో పోలీసుల పురోగతి

అక్బర్‌ ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవు  

'ఆ సంఘటన నన్ను బాగా కలిచి వేసింది'

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

బిగ్‌బాస్‌.. హేమ ఎలిమినేటెడ్‌