ఎంసెట్‌ కేసులో త్వరలో చార్జిషీట్‌ 

25 Nov, 2017 02:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండు రాష్ట్రా ల్లో సంచలనం రేపిన ఎంసెట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సీఐడీ చార్జిషీట్‌ దాఖలు చేయబోతోంది. అయితే, కొద్ది నెలల క్రితమే డ్రాఫ్ట్‌ చార్జిషీట్‌ సిద్ధం చేసిన సీఐడీ, మరిన్ని అంశాలపై క్లారిటీ కోసం జేఎన్‌టీయూకు 3 నెలల క్రితం లేఖ రాసింది. ప్రశ్నపత్రం రూపొందించిన అధికారులు, మినిట్స్‌బుక్‌ తదితర వ్యవహారాల డాక్యుమెంట్లు కావా లని కోరింది. దీంతో జేఎన్‌టీయూ అధికారులు రెండు రోజుల క్రితం వివరాలను సీఐడీకి అందించినట్లు తెలిసింది.  

ప్రింటింగ్‌ ప్రెస్‌ పాత్రపై ఆరా..
జేఎన్‌టీయూ ఎంసెట్‌ ప్రశ్నపత్రం రూపొందించిన కమిటీ అధికారులు, వారి వ్యవహారాలపై విచారణ జరిపిన సీఐడీ  అధికా రులు వారి వద్ద నుంచి ప్రశ్నపత్రం బయటకు వెళ్లలేదని నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఇక ఇప్పటికే సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌సింగ్‌ ఢిల్లీ శివారు లోని ప్రింటింగ్‌ ప్రెస్‌ను పరిశీలించి వివరాలు సేక రించారు. ఈ నేపథ్యంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ యాజమాన్యం పాత్రపై అభియో గాలు మోపుతూ చార్జిషీట్‌ దాఖలు చేయ నున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 

నిందితులపై అభియోగాలు నమోదు
ఈ కేసులో సీఐడీ ఇప్పటి వరకు 12 మంది ప్రధాన నిందితులతో పాటు 66 మంది బ్రోకర్లను అరెస్ట్‌ చేసి జైలుకు పంపించింది. వీరిలో ఇద్దరు ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన డాక్టర్లు ఉండగా, మరో ఇద్దరు మహిళా బ్రోకర్లున్నారు. కీలక సూత్రధారి, స్కాంకు ఆధ్యుడైన కమిలేశ్‌కుమార్‌ సింగ్‌ సీఐడీ కస్టడీలోనే గుండెపోటుతో మృతి చెందాడు. మిగిలిన 16 మంది నిందితులు పరారీలో ఉండగా వారిపై అభియోగాలు నమోదు చేసి చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేస్తామని అధికారులు తెలిపారు.   
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పార్టీని మీరే కాపాడాలి : సోనియా

2,166 మందిపై అనర్హత వేటు

ఎన్‌ఆర్‌ఐ మహిళలు మరింత సేఫ్‌

ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై వేటు సబబే

దసరా నాటికి పార్టీ జిల్లా ఆఫీసులు

ఓసీలు బీసీలుగా.. బీసీలు ఎస్సీలుగా..

డీఐఎంఎస్‌లో ఏసీబీ తనిఖీలు

జైలులో జీవిత ఖైదీ ఆత్మహత్య

ఆమెకు రక్ష

సీఎం కేసీఆర్‌ది మేకపోతు గాంభీర్యం 

ఉగ్రవాదంపై ‘వర్చువల్‌’ పోరు!

నేటి నుంచి అసెంబ్లీ 

అజంతా, ఎల్లోరా గుహలు కూల్చేస్తారా? 

నల్లమలలో అణు అలజడి!

కోర్టు ధిక్కార కేసులో శిక్షల అమలు నిలిపివేత

‘వ్యవసాయానికి 5 శాతం కేటాయింపులా’

సిటీకి దూపైతాంది

‘ఐ లవ్‌ మై జాబ్‌’ 

ఎలక్ట్రిక్‌ బస్సు సిటీ గడప దాటదా?

24 నుంచి ఇంజనీరింగ్‌ చివరి దశ కౌన్సెలింగ్‌

‘పుర’ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం 

భాగ్యనగరానికి జపాన్‌ జంగల్‌

ఎన్నికలకు నో చెప్పిన హైకోర్టు

ఈనాటి ముఖ్యాంశాలు

విషాదం: లిఫ్ట్‌ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి

హైదరాబాద్‌లో నీటికి ఢోకా లేదు..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

శ్రీచైతన్యలో పుడ్‌ పాయిజన్‌..40మందికి అస్వస్థత

సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారీ ఎన్‌కౌంటర్‌కు ప్లాన్‌

‘కేసీఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆయన తన మూడో కన్ను తెరిపించాడు..!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో