చార్జింగ్ పెడుతూ.. నవ వరుడు మృతి

17 May, 2015 01:23 IST|Sakshi

పెద్దవూర:  సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు.  నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం శిర్సనగండ్లకు చెందిన కంభంపాటి నరేష్ (24) శుక్రవారం రాత్రి  సెల్‌కు చార్జింగ్ పెడుతుండగా.. చా ర్జర్ పిన్‌కు విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి కింద పడిపోయాడు.

దీం తో తల వెనుక భాగం గోడకు బలంగా తాకడంతో  మృతిచెందాడు. విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మృతుడు నరేష్‌కు గత నెల 23 న వివాహం జరిగింది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
 

మరిన్ని వార్తలు