వ్యాక్సిన్‌తోనే అనారోగ్యానికి చెక్‌

1 Dec, 2017 00:36 IST|Sakshi

దేశంలో మెజారిటీ వయోజనుల అభిప్రాయమిదే

ఇప్సోస్‌ మోరీ సర్వేలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో మెజారిటీ ప్రజలు వ్యాక్సిన్‌ పట్ల విశ్వసనీయంగా ఉన్నారు. ముందస్తు టీకాలు తీసుకో వడంతో భవిష్యత్తులో రోగాలు రావనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. వ్యాక్సిన్‌పై క్షేత్రస్థాయిలో ఉన్న అభిప్రాయాలపై ప్రముఖ పరిశోధక సంస్థ ఇప్సోస్‌ మోరీ పలు దేశాల్లో వ్యాక్సినేట్‌ ఫర్‌ లైఫ్‌ పేరిట సర్వే నిర్వహిం చింది. బ్రెజిల్, భారత్, అమెరికా, జర్మనీ, ఇటలీలో 6,002 శాంపిల్స్‌ తీసుకుని సర్వే చేసింది.

మన దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో శాంపిల్స్‌ను విశ్లేషించింది. ఇందులో వ్యాక్సిన్లు పిల్లలు, శిశువుల కోసమని 38 శాతం మంది భావిస్తు న్నట్లు వెల్లడైంది. మరో 34 శాతం మాత్రం ఇతర దేశాలకు వెళ్లే సమయంలోనే పెద్దలకు వ్యాక్సినేషన్‌ అవసరమన్నా రు. పూర్తిస్థాయి ఆరోగ్యవంతులకు వ్యాక్సినేషన్‌ అవసరం లేదని 26 శాతం మంది తెలిపారు. 19 శాతం మంది వయోవృద్ధులకు వ్యాక్సినేషన్‌ తప్పనిసరని చెప్పారు.

పెద్దల వ్యాక్సినేషన్‌పై అవగాహనలేమి..
వ్యాక్సిన్‌ సాధారణంగా పిల్లలు, శిశువులకే ఎక్కువగా ఇస్తున్నా.. పెద్దలకు సైతం పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వమే వీటిని సరఫరా చేస్తోంది. పెద్దల వ్యాక్సినేషన్‌పై 60 శాతం మందికి అవగాహన లేదని తేలింది. 31 శాతం మంది గత ఐదేళ్లలో ఎలాంటి వ్యాక్సిన్లు తీసుకోలేదని తెలిసింది.

పోషకాహారానికి హైదరాబాద్‌ జై
దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైద రాబాద్‌ పౌరుడు పోషకాహారానికి ప్రాధాన్య మిస్తున్నట్లు 81 శాతం మంది ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. 35 శాతం మంది మెరుగైన ఆరోగ్య జీవనశైలిని అను కరిస్తున్నారు. 24 శాతం మంది తమ వృత్తి పట్ల సంతృప్తికరంగా ఉన్నారు. 11 శాతం మంది సొంతింటిని కలిగి ఉండగా.. 8 శాతం మంది ఆర్థికంగా సౌకర్యవంతంగా ఉన్నారు. 3 శాతం మంది విదేశీ ప్రయాణాలు చేస్తు న్నారు. 45 శాతం మంది క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించు కుంటున్నారు. 38 శాతం మంది కేన్సర్‌ వంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకుంటున్నారు. 36 శాతం మంది సాధారణ, దంత సంబంధిత పరీక్షలు చేయించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు