ఇంటింటి సర్వేపై తనిఖీ

12 Aug, 2014 01:18 IST|Sakshi
ఇంటింటి సర్వేపై తనిఖీ
  • వచ్చే నెలలో ప్రత్యేక కార్యక్రమం  
  •  అందులో తప్పులు తేలితే ప్రభుత్వ ప్రయోజనాలుండవు
  •  ఉప కులాలనూ వెల్లడించాల్సిందే.. 
  •   గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల పేర్లు  
  •   అనర్హులకు లబ్ధి చేకూరినట్లు ఫిర్యాదులు వస్తే విచారణ 
  •  
     సాక్షి, హైదరాబాద్:  సమగ్ర ఇంటింటి సర్వేతోనే ఈ ప్రక్రియ ముగిసిపోదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సర్వేలో వచ్చిన సమాచారం నిర్ధారణకు సెప్టెంబర్‌లో ప్రత్యేక తనిఖీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 19వ తేదీన నిర్వహించే సమగ్ర ఇంటింటి సర్వే సమాచారం కంప్యూటరీకరణ కార్యక్రవూన్ని సెప్టెంబర్ 4వ తేదీ నాటికి ముగించాలని నిర్ణయించింది. ప్రజలు ఇచ్చిన సమాచారాన్నే ఆధారంగా చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులను ఎంపిక చేయురాదని, ఆ సమాచారం వాస్తవమా..? కాదా..? అన్న అంశాన్ని సవివరంగా తేల్చుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక బృందాల తనిఖీ తరువాత..సరైన సమగ్ర సమాచారాన్ని కంప్యూటర్లలో నమోదు చేయనున్నట్లు ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. కావాలని తప్పుడు సమాచారం ఇస్తే నష్టం తప్ప ప్రయోజనం ఉండదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 
     
    ముందు ముందు ప్రభుత్వ పథకాలకు వారు అనర్హులయ్యే అవకాశవుుంటుందని ఆ వర్గాలు పేర్కొన్నారుు. సర్వే ఫార్మాట్‌లో పేర్కొన్న విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ సామాజిక వర్గంతోపాటు వారి ఉప కులాలను కూడా వెల్లడించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐదు పేజీలున్న ఈ సర్వే ఫార్మాట్‌లో.. ఈ నిబంధనను కూడా ఉంచారు. దీని ద్వారా ఏయే కులాలు ఏ మేరకు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నాయో స్పష్టం అవుతుందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ప్రభుత్వం అందించే ప్రతీ ప్రయోజనం అర్హులకు మాత్రమే చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నామని  ఆ వర్గాలు పేర్కొన్నారుు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు, గృహాలు, భూ పంపిణీ లబ్ధిదారుల వివరాలన్నిటినీ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. 
     
    ఈ లబ్ధిదారుల జాబితాను చూసి, అందులో బోగస్ లబ్ధిదారులున్నా.. అనర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నట్లు తేలినా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని అధికారవర్గాలు తెలిపారుు. విచారణలో అనర్హులకు లబ్ధి కలుగుతున్నట్లు తేలితే.. వారికిచ్చిన ప్రభుత్వ ప్రయోజనాన్ని రద్దు చేయనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆ పథకానికి అర్హుడైన పక్షంలో.. ఆ వ్యక్తిని సంబంధిత పథకానికి ఎంపిక చేస్తావుని అధికారులు తెలిపారు. అన్ని సంక్షేమ పథకాలు పూర్తి పారదర్శకతో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నావుని వివరించారు. లబ్ధిదారుల పేర్లన్నీ ఆయా ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లలో ఉంచుతావుని చెప్పారు. 
మరిన్ని వార్తలు