‘కేసీఆర్‌కు కరోనా కన్నా పెద్ద వైరస్‌ సోకాలి’

3 Jun, 2020 08:33 IST|Sakshi

సాక్షి, గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్‌): తెలంగాణ అమరవీరుల, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా కన్నా పెద్ద వైరస్‌ సోకాలని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ అన్నారు. మంగళవారం ఆదర్శ్‌నగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, తెలంగాణ ఇంటి పార్టీ 3వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. (సందిగ్ధంలో టీడీపీ అధ్యక్షుడి ఎంపిక)

ఈ సందర్భంగా జెండాను ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. సుధాకర్‌ మాట్లాడుతూ జై తెలంగాణ అని రక్తం చిందించిన ఉద్యమకారులు నేడు జైలులో ఉంటే తెలంగాణ రద్దు అన్న ద్రోహులు నేడు కేసీఆర్‌ చుట్టూ అధికారంలో ఉన్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం చివరి వరకు పోరాడతామని తెలిపారు. సమావేశంలో 1969 ఉద్యమ కారులు, రామరాజు, శ్రీహరి, కొండస్వామి, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, సందీప్, హరీశ్‌యాదవ్‌ పాల్గొన్నారు. (కోడికి చారానా.. మసాలాకు బారానా)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా