జీఎస్టీ అమలుపై సీఎం హర్షం

19 Jul, 2017 02:00 IST|Sakshi
జీఎస్టీ అమలుపై సీఎం హర్షం

సాక్షి, హైదరాబాద్‌: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమ ల్లో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చేస్తున్న కృషిని సీఎం కె.చంద్రశేఖర్‌ రావు అభినందించారు. జీఎస్టీపై అవగాహన కల్పించి, వ్యాట్‌ ఖాతా దారులను జీఎస్టీ కింద రిజిస్టర్‌ చేయడంలో వాణిజ్య పన్నుల శాఖ మంచి కృషి చేసిందని సీఎం కితాబిచ్చారు.

ఈ నెలాఖరులోగా రాష్ట్రం లోని 100 శాతం వ్యాట్‌ ఖాతాదారులను జీఎస్టీ కింద రిజిస్టర్‌ చేయాలని ఆదేశించారు. గ్రానైట్, బీడీ పరిశ్రమలతో పాటు ప్రజోపయోగ పనుల విషయంలో జీఎస్టీ కింద రాయితీలు, మినహా యింపునివ్వాలని ఇప్పటికే సీఎం కేంద్రానికి లేఖ రాశారని, ఎక్కువ మంది ఆధారపడే ఈ రం గాలు జీఎస్టీ అమలుతో ప్రతికూలత ఎదు ర్కొం టున్నాయని ఆవేదన వ్యక్తం చేసినట్లు సీఎం కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి.

మరిన్ని వార్తలు