బాల్య వివాహానికి అడ్డుకట్ట!

22 Feb, 2016 02:29 IST|Sakshi
బాల్య వివాహానికి అడ్డుకట్ట!

ఎర్రబొట్టు కార్యక్రమాన్ని నిలిపివేసిన సూపర్‌వైజర్, సర్పంచ్
పెళ్లి చేయమని హామీ ఇచ్చిన అమ్మారుు తల్లిదండ్రులు

   
 కెరమెరి : మరో నెల తర్వాత వివాహం.. అందుకు ఆ కుటుంబంలో సందడి నెలకొంది. పెళ్లికి ముందు నిర్వహించే కార్యక్రమం ఎర్రబొట్టును ఆదివారం ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ప్రమీల, మోడీ గ్రామ పంచాయతీ సర్పంచ్ పెందూర్ జలపతి అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మోడి పంచాయతీ పరిధి కొలాంఝరి గ్రామానికి చెందిన టేకం భీంరావు, కన్నిబాయి దంపతుల కూతురు సోంబాయి(14)తో ముర్కిలొంక గ్రామానికి చెందిన ఆత్రం రాజు(18)కు నెల తర్వాత వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎర్రబొట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నారని అందుకున్న సమాచారంతో సూపర్‌వైజర్ ప్రమీల, సర్పంచ్ జలపతి ఆ గ్రామానికి వెళ్లారు. ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అబ్బాయి, అమ్మాయిల వయసు చాలా తక్కువగా ఉందని, ఇది చట్టవిరుద్దమని తెలిపారు.

అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సారాల వయసు ఉండాలని, అప్పుడే వివాహానికి అర్హులని పేర్కొన్నారు.ను అతిక్రమించి పెళ్లి జరిపిస్తే రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు, రూ.2 లక్షల జరిమానా విధించనున్నట్లు చెప్పారు. అలాగే చిన్నతనంలో పెళ్లి చేస్తే భవిష్యత్తులో జరిగే అనర్థాలను వివరించారు. దీంతో వయసు నిండాకే వివాహం చేస్తామని అమ్మాయి తల్లిదండ్రులు హామి ఇచ్చారు. అమ్మాయిల చదువు కోసం చాలా చేస్తుందని పాపను చదివిస్తే సమాజంగురించి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ,ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. దీంతో ఎర్రబొట్టు కార్యాక్రమానికి వచ్చిన బంధువులతో పాటు కుటుంభ సభ్యులు ప్రమీలమాటలకు ఏకీభవించి కార్యక్రమాన్ని నిలిపివేశారు.

>
మరిన్ని వార్తలు