నిలిచిన బాల్యవివాహాలు

2 Mar, 2017 21:22 IST|Sakshi
నిలిచిన బాల్యవివాహాలు
 
► వేర్వేరుచోట్ల అడ్డుకున్న అధికారులు 
 
రంగాపూర్‌ (వనపర్తి) : ప్రభుత్వం ఒక పక్క బాల్యవివాహాలు చేయకూడదని అవగాహన కల్పిస్తుంటే మరోపక్క గ్రామాల్లో తల్లిదండ్రులు గుట్టుచప్పుడు కాకుండా చిన్నతనంలో పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. పెబ్బేరు మండలం రంగాపూర్‌లో బాల్యవివాహాం  జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న అధికారులు బుధవారం గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.  చిన్నవయసులో పెళ్లి చేస్తే కలిగే నష్టాలను వివరించారు. కాదని వివాహాం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐలు నాగశేఖర్‌రెడ్డి, అభినవ్‌చత్ర్‌వేద్‌ హెచ్చరించారు. వారివెంట తహసీల్దార్‌ దత్తాత్రి ఉన్నారు.
 
సింగోటంలో .. కొల్లాపూర్‌ రూరల్‌ : మండలంలోని సింగోటం గ్రామంలో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గురువారం మైనర్‌కు వివాహం  చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న సీఐ శ్రీనివాసరావు బుధవారం ఉదయం తన సిబ్బందితో గ్రామానికి వెళ్లి తల్లిదండ్రుల స్టేషన్కు తీసుకెళ్లారు. చట్టవిరుద్ధ పనులు చేయకూడదని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వయసు పూర్తికాకముందే వివాహం చేస్తే చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులను హెచ్చరించారు. 
 
మరిన్ని వార్తలు