‘చేప మందు పంపిణీకి అనుమతివ్వొద్దు’

6 May, 2020 08:06 IST|Sakshi

నాంపల్లి: కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నగరంలో వచ్చే జూన్‌ 7 నుంచి బత్తిన సోదరుల ఆధ్వర్యంలో చేప మందు పంపిణీకి అనుమతి ఇవ్వొద్దని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు కోరారు. చేప మందు కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది వస్తారని, వీరిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా అందరికీ వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా పిల్లలకు త్వరగా కరోనా వ్యాపించవచ్చని,ఎట్టి పరిస్థితుల్లోను చేప ప్రసాదం పంపిణీకి అనుమతించవద్దని బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోందన్నారు.

మరిన్ని వార్తలు