రారండోయ్‌..సినిమా చూద్దాం

8 Nov, 2017 11:05 IST|Sakshi

నేటినుంచి నల్లగొండలో చిల్డ్రన్‌ ఫిలిం ఫెస్టివల్‌

పిల్లలను కనువిందు చేయనున్న సినిమాలు

జిల్లాకేంద్రంలోని నటరాజ్‌ థియేటర్‌ ఎంపిక

రోజూ మూడు సినిమాల చొప్పున ప్రదర్శన

15 హిందీ, 6 తెలుగు సినిమాలు

అన్నీ సాహసం, పిల్లలకు స్ఫూర్తినిచ్చే చిత్రాలే

సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పిలుపు

నల్లగొండ కల్చరల్‌ : అంతర్జాతీయ చిల్డ్రన్‌ ఫిలిం ఫెస్టివల్‌కు జిల్లాకేంద్రం ముస్తాబైంది. ఉత్సవంలో భాగంగా నల్లగొండ పట్టణంలోని నటరాజ్‌ (సినిమాహాల్‌) థియేటర్‌లో ఈనెల 8 (బుధవారం) నుంచి 14వ తేదీ వరకు పలు బాలల చిత్రాలను ప్రదర్శించనున్నారు. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా వారం రోజులపాటు రోజూ 3 సినిమాలు పిల్లలను కనువిందు చేయనున్నాయి. వీటిని పిల్లలకు ఉచితంగా చూయించొచ్చు. వీటిలో 15 హిందీ, 6 తెలుగు సినిమాలు ఉంన్నాయి. సినిమాలన్నీ సాహసవంతమైనవి, బాల బాలికల, మానసిక ఉల్లాసాన్ని కలిగించేవి. రాష్ట్ర చలన చిత్ర అభివృద్ది సంస్థ ద్వారా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ ఫిలిం ఫెస్టివల్‌ను బుధవారం ఉదయం 10గంటలకు కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్, ఇతర అధికారులు ప్రారంభిస్తారు. 

ప్రదర్శించే సినిమాలు..
మొదటిరోజు బుధవారం‘‘ఎక్‌థా భుజంగ్‌ (ఒకపాము ఉండేది), 12గంటలకు ‘ఫొటో’, 2గంటలకు ‘ఛూలేంగే ఆకాశ్‌ (ఆకాశాన్ని అందుకుంటాను) హిందీ సినిమాలను ప్రదర్శిస్తారు. 9వ తేదీన 8 ‘సిక్సర్‌’, 12గంటలకు ‘హాలో’ హిందీ సినిమాలు, 2గంటలకు ‘ఫూర్ణ’ అనే తెలుగు చిత్రం ఉంటుంది. 10న ఉదయం 10గంటలకు ‘పప్పుకిపుగ్‌–డండి’’, 12గంటలకు ‘ఫింటీకా సాబూన్‌’ (ఫింటి అనే పిల్లవాడి సబ్బు), 2గంటలకు ‘చదువుకోవాలి’ అనే చిత్రాలు ప్రదర్శితమవుతాయి. 11న ఉదయం 10గంటలకు ‘హెడా–హోడా’, 12గంటలకు ‘కౌరామతికోటు’, మధ్యాహ్నం 2గంటలకు ‘‘హ్యాపీ మదర్స్‌–డే’ హిందీ చిత్రాలు వేయనున్నారు. 12వ తేదీ ఉదయం 10గంటలకు ‘అమూల్య’, 12గంటలకు ‘ఎక్‌ అజూబా’, మధ్యాహ్నం 2గంటలకు ‘ఆదిత్య’ చిత్రాలు ప్రదర్శిస్తారు. 13న ఉదయం 10గంటలకు ‘షాను ద ఆప్టిమెస్ట్‌’ 12గంటలకు ‘బండూభాస్కర్‌’, 2గంటలకు ‘చూలేంగ్‌ ఆకాశ్‌’ సినిమాలు వేస్తారు. 14న ఉదయం 10గంటలకు ఛోటా సిఫాయి’ (చిన్న సైనికుడు) 12గంటలకు ‘ఛుట్‌కన్‌కి మహౠభారత్‌’,  2గంటలకు ‘‘అప్పుదక్రేజీబాయ్‌’ తెలుగు చిత్రం ప్రదర్శితమవుతాయి. హిందీ చిత్రాలన్నీ తెలుగుసబ్‌ టైటిల్స్‌లో ప్రదర్శిస్తారు. దాదాపు సినిమాలకు సంబంధించిన కథాంశాన్ని సంక్షిప్తంగా పొందుపర్చిన కరపత్రాలు అందుబాటులో ఉంచారు. 

నేటి కార్యక్రమాలు..
ఉదయం 10గంటలకు నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధులు, 12గంటలకు సందీప్, జేబీఎస్‌ పాఠశాలల విద్యార్థులు, 2గంటలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల (డైట్‌) విద్యార్ధులకు సినిమాలను ప్రదర్శిస్తారు. వారం రోజుల పాటు ఉంటే ఈ చిత్రపదర్శనలు ఉంటాయని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల యాజమాన్యం పిల్లలకు ఈ సినిమాలు చూపించి విజయవంతం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు