ఉద్యమంలో కిషన్‌రెడ్డిది కీలకపాత్ర

15 Aug, 2019 11:26 IST|Sakshi
నివాళులు అర్పిస్తున్న హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు

కౌడిపల్లిలో చిలుముల కిషన్‌రెడ్డి ప్రథమ వర్ధంతిలో పాల్గొన్న నాయకులు

వారి కుటుంబానికి అండగా ఉంటాం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు

సాక్షి, నర్సాపూర్‌: తండ్రిని ఎదిరించి టీఆర్‌ఎస్‌ జెండా పట్టి తెలంగాణ ఉద్యమంలో ముందున్న చిలుముల కిషన్‌రెడ్డి కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుధవారం కౌడిపల్లిలో దివంగత టీఆర్‌ఎస్‌ నాయకుడు, కేంద్ర కార్మికశాఖ కనీస వేతనాల కమిటీ మాజీ చైర్మన్‌ చిలుముల కిషన్‌రెడ్డి ప్రథమ వర్ధంతిని భార్య సుహాసినిరెడ్డి, కొడుకు శేషసాయిరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్, మెదక్‌ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, పద్మాదేవెందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత శేఖర్‌గౌడ్, మాజీ మంత్రి సునీతారెడ్డి, మాజీ ఎంపీ వివేక్, బీజేపీ నాయకులు రఘునందన్‌రావ్‌ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి సమాధివద్ద పూలమాలవేసి నివాళులు అర్పించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అతనిలేని లోటు తీరనిదని ఆత్మకు శాంతి కలగాలన్నారు. అతని కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామన్నారు. అనంతరం ఎంపీ కొత్తప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ కిషన్‌రెడ్డి మృతి నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌కి తీరనిలోటన్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో తన గెలుపుకోసం తమ్ముడు కిషన్‌రెడ్డి ఎంతగానో కృషిచేశాడని తెలిపారు. మాజీ ఎంపీ వివేక్‌ మాట్లాడుతూ కిషన్‌రెడ్డి తన క్లాస్‌మెట్‌ అని అందరితో కలివిడిగా ఉండి ప్రజాసేవకు పాటుపడ్డ వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మాజీ జిల్లా అధ్యక్షుడు మురళీధర్‌ యాదవ్, నాయకులు నరేంద్రనాథ్, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గోపి, స్థానిక ఎంపీపీ రాజు, జెడ్పీటీసీ కవిత అమర్‌సింగ్, ఏఎంసీ చైర్మన్‌ హంసీబాయ్, మండల సర్పంచ్‌లఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు లక్ష్మీరవీందర్‌రెడ్డి, కృష్ణగౌడ్, దుర్గాగౌడ్, శెట్టయ్య, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.  

స్వగృహంలో..
నర్సాపూర్‌: చిలుముల కిషన్‌రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి  మాజీ మంత్రులు హరీశ్‌రావు, సునీతారెడ్డి, మెదక్‌ ఎంపీ కొత్త ప్ర భాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిలుములమదన్‌రెడ్డి, పద్మ, టీఆర్‌ఎస్‌ నాయకులు దేవేందర్‌రెడ్డి, మురళీధర్‌యాదవ్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కిషన్‌రెడ్డి భార్య సుహాసినిరెడ్డి, తనయుడు చిలిపిచెడ్‌ జెడ్పీటీసీ సభ్యుడు చిలుముల శేషసాయిరెడ్డిలను పరామర్శించారు. కాగా పలువురు స్థానిక నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. 


నివాళులు అర్పిస్తున్న మాజీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు  

మరిన్ని వార్తలు