ధార్మిక  విప్లవాన్ని సాధించిన మహనీయుడు పెదజీయర్‌

2 Nov, 2019 03:51 IST|Sakshi
సహస్ర కలశాభిషేకంలో భాగంగా ఉత్సవ మూర్తులకు హారతి ఇస్తున్న చినజీయర్‌స్వామి

ఆయన జీవిత ఘట్టాలను వివరించిన చినజీయర్‌స్వామి

శంషాబాద్‌ రూరల్‌ (రాజేంద్రనగర్‌): ధార్మిక విప్లవాన్ని సాధించిన మహనీయుడు పెదజీయర్‌ స్వామి అని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామి చెప్పారు. ఆయన 1909 నుంచి 1979 వరకు ఈ భూమిపై భౌతికంగా సంచరించారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని ముచ్చింతల్‌లో ఐదు రోజులుగా సాగుతున్న చినజీయర్‌ స్వామి ‘తిరునక్షత్ర’మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా చినజీయర్‌ అనుగ్రహ భాషణం చేశారు. దీపావళి నుంచి 5రోజులుగా దివ్యసాకేత క్షేత్రంలో సీతారామచంద్రస్వామి పునరాగమన కార్య క్రమం జరుపుకున్నట్లు తెలిపారు. 1930కి పూర్వం బ్రాహ్మణులు తప్పా మిగతా వారెవ్వరూ భగవద్గీత, రామాయణం, సహస్రనామాన్ని ముడితే తప్పు, పాపం అనే భావనలో ఉండేవారనీ పెదజీయర్‌ స్వామి ఉద్యమించాక అవి శ్రద్ధ కలిగిన ప్రతి వ్యక్తికి అందుబాటులోకి వచ్చాయన్నారు. కార్యక్రమంలో మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్‌రా వు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు