టీఆర్‌ఎస్‌ నాయకులను విమర్శించే హక్కులేదు: చింతా ప్రభాకర్‌

8 Jul, 2019 17:00 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : ప్రజలకు సేవ చేయకుండా అవినీతి, అక్రమాలు చేసిన జగ్గారడ్డిని చూసి జనాలు ఈసడించుకుంటున్నారు అన్నారు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల కోసం జగ్గారెడ్డి మాయ మాటలు చెబుతున్నాడని మండి పడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. ప్రజలకు కనీసం అందుబాటులో లేకుండా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరం అన్నారు. సింగూరు ప్రాజెక్ట్‌ గురించి జగ్గారెడ్డి ప్రతిసారి అవాస్తవాలే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులను విమర్శించే హక్కు జగ్గారెడ్డికి లేదని తెలిపారు.

తన అవినీతి అక్రమాలపై జగ్గారెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రభాకర్‌ ప్రశ్నించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా సింగూరు ప్రాజెక్ట్‌ ఎండిపోవడం మామూలే అన్నారు. గతంలో 2005, 2008, 2015లో సింగూర్‌ పూర్తిగా ఎండిపోయిందని గుర్తు చేశారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో సమర్థులైన నాయకులను నిలబెడతాం అన్నారు. జగ్గారెడ్డి, హరీశ్‌ రావు కాలి గోటికి ఉన్న దుమ్ముతో సమానం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌ రావు, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, చింత ప్రభాకర్‌లపై విమర్శలు చేస్తే గెలుస్తాను అనుకోవడం జగ్గారెడ్డి ముర్ఖత్వం అన్నారు ప్రభాకర్‌.

మరిన్ని వార్తలు