ఆఫీసర్‌.. నేను ఎమ్మెల్యేనయ్యా

16 Aug, 2019 08:50 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : ‘ఆఫీసర్‌ నేను ఎమ్మెల్యేను.. కార్యక్రమ ఆహ్వానితుడను..’ అంటూ తన ను అడ్డుకున్న పోలీస్‌ అధికారికి చొప్పదండి ఎమ్మెల్యే చెప్పుకోవాల్సి వచ్చింది. స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులుకు ఆహ్వాన లేఖలు పంపిం చారు. గురువారం వేడుకలకు హాజరయ్యేం దుకు వచ్చిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను వారికి కేటాయించిన ప్రాంతంలోకి రాగా ఓ సీఐ అనుమతించలేదు. దీం తో ఆఫీసర్‌ నేను చొప్పదండి ఎమ్మెల్యేనంటూ తనను తాను చెప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత సదరు అధికారి లోనికి అనుమతించారు. ప్రధాన గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిక్‌ గార్డ్‌ కార్యక్రమానికి వస్తున్న పలువురిపై దురుసుగా మాట్లాడుతూ నెట్టివేయడం కనిపించింది. ఈవిషయం అధికారుల దృష్టికి తీసుకపోయినా స్పందన కరువైంది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు