మహిళకు మజ్జిగ ఇచ్చి..

3 Jul, 2014 02:35 IST|Sakshi

బరాఖత్‌గూడెం,(మునగాల) : మహిళకు మత్తుపదార్థం కలిపిన మజ్జిక ఇచ్చి పుస్తెలతాడును అపహరించారు. సినీఫక్కీలో జరిగిన ఈ చోరీకి సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..  మండలంలోని బరాఖత్‌గూడెం గ్రామానికి చెందిన కడెం నారాయణమ్మ రెండు రోజుల క్రితం విజయవాడలో ఉన్న తన కుమారుడి వద్దకు వెళ్లింది. కాగా, బుధవారం స్వగ్రామానికి వచ్చేందుకు విజయవాడలో బస్సు ఎక్కింది.  ఈ క్రమంలో నారాయణమ్మ వెంట ఓ మహిళ విజ యవాడలో బస్సు ఎక్కి పక్కనే కూర్చొని మాటలు కలిపింది. తాను కోదాడ వరకు వస్తానని చెప్పింది.
 
 మార్గమధ్యలో నారయణమ్మకు సదరు మహిళ తాగమని మజ్జిగ ఇచ్చింది. నారాయణమ్మ చేదుగా ఉందని కొద్దిగా తాగింది. ఈ లోగా కోదాడ రావడంతో నారాయణమ్మ బస్టాండ్‌లో బస్ దిగి స్వగ్రామం వెళ్లేందుకు సూర్యాపేట వైపు వెళ్లే బస్సు ఎక్కింది. ఈ లోగా ముస్లిం బురకా వేసుకున్న మరో మహిళ వచ్చి నారాయణమ్మ పక్క సీటులో కూర్చుంది. అప్పటికే మైకంతో కళ్లు తిరుగుతున్నట్లనిపించిన నారాయణమ్మ బరాఖత్‌గూడెంలో బస్సు దిగింది. పక్కనే ఉన్న ముసుగు ధరించిన మహిళ నారాయణమ్మను తోడ్కొని గ్రామంలోని ఆమె ఇంటికి చేరుకుంది.
 
 ఈ లోగా పూర్తిగా మైకంలోకి వెళ్లిన నారాయణమ్మ మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును బుర్కా ధరించిన మహిళ తస్కరించింది. అందరూ చూస్తూండగానే బయటకు వచ్చి అక్కడే సిద్ధంగా ఉన్న ఆటోలో కోదాడ వైపు వెళ్లింది. మైకం నుంచి తేరుకున్న నారాయణమ్మ తన మెడలో ఉన్న బంగారు గోలుసు చోరీకి గురైనట్లు గుర్తించి కుటుంబసభ్యులకు తెలి పింది. వారు వెతకకగా నిందితురాలి అడ్రసు లేకుం డా పోయి ంది. లబోదిబోమటూ నారాయణమ్మ కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.
 

మరిన్ని వార్తలు