మెదక్‌ చర్చిలో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

26 Dec, 2017 01:46 IST|Sakshi

భక్తులతో కిటకిటలాడిన చర్చి ప్రాంగణం

సాక్షి, మెదక్‌: ప్రసిద్ధ మెదక్‌ సీఎస్‌ఐ చర్చిలో సోమవారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు వేడుకలకు హాజరయ్యారు. సీఎస్‌ఐ సంఘం అధ్యక్షుడు బిషప్‌ ఏసీ సాల్మన్‌రాజ్‌ ఆధ్వర్యంలో వేకువజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ప్రెస్బిటరీ ఇన్‌చార్జి వై.రాబిన్‌సన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి ఎదురుగా ఉన్న శిలువ వద్ద భక్తులు కొవ్వొత్తులు ఉంచి ప్రార్థనలు చేశారు.  డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి మహాదేవాలయం ప్రాంగణంలో కేక్‌ కట్‌ చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.  

భారతి సిమెంట్‌ ఆధ్వర్యంలో పాలు వితరణ: క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని భారతి సిమెంట్‌ ఆధ్వర్యంలో సుమారు ఆరువేల మంది భక్తులకు పాలవితరణ చేశారు. కార్యక్రమంలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ కొండల్‌రెడ్డి, సీనియర్‌ మేనేజర్‌ ఓబుల్‌రెడ్డి, సేల్స్‌ మేనేజర్‌ సతీశ్‌కుమార్, టెక్నికల్‌ మేనేజర్‌ గంగాధర్, మెదక్‌ డీలర్‌ లింగమూర్తి, విజయ్, లక్ష్మీనారాయణ, సంగమేశ్వర్, కృష్ణకాంత్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు